31, జులై 2025, గురువారం

రారా

 
రామ రామ సీతారామ
రారా నన్నేల
నీమీదనె నామనసు 
నిలిచెను హరి రారా

యాగరక్షణాదక్ష
హరి నీవిటు రారా
యోగిహృదయోల్లాస
యొప్పుగ నిటు రారా
భోగీంద్రశయన హరి
పొలుపుగ నిటు రారా
శ్రీగౌరీపతినుత
సీతాపతి రారా

కామితార్ధప్రదాయక
గరుడగమన రారా
కోమలాంగ శ్యామలాంగ
గోవిందుడ రారా
భూమిసుతాప్రాణపతీ
భువనేశ్వర రారా
క్షేమకరా భవతారక
నామా యిటు రారా

ప్రేమతో మాటలాడు
విభుడా యిటు రారా
నా మనవులు కొన్ని గలవు
నానాథుడ రారా
భూమిపాలకులతిలక
పురుషోత్తమ రారా
స్వామీ నీరాకకై
ప్రతీక్షింతు రారా

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆమోదించిన వ్యాఖ్యలే ప్రచురితం అవుతాయి. తరచుగా పరిశీలించటం వీలు కాదు కాబట్టి అప్పుడప్పుడు వ్యాఖ్యలు కనిపించటం ఆలస్యం కావచ్చును. తరచుగా జవాబులు ఇవ్వటం నాకు వీలు కాదు. ఎక్కువగా చర్చించటం అస్సలు వీలుకాదు.