17, జులై 2025, గురువారం

నరుడా వినరా

నరుడా వినరా పరమ సత్యము 
పరమ సుఖమును హరి యొసగేను

హరిని మరచెనా నరుడు చెడేను
నరుడు చెడేనా నరక మబ్బేను
నరక మబ్బేనా మరి బాధేనూ
హరి నెన్నడును మరువకు నరుడా

మరల పుట్టుట మరల చచ్చుట
మరల బాధల పొరలి యేడ్చుట
నరుని కెందుకు హరిని కొలిచిన
పరమ పదమునే నరుడు పొందును

హరినికొలుచుటే పరమసుఖమని
యెరిగిన నరుడే హరిని కొలుచును
హరిని కొలిచిన నరుడు ముక్తుడు
మరల పుట్ఝడు మరల పుట్టడు

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆమోదించిన వ్యాఖ్యలే ప్రచురితం అవుతాయి. తరచుగా పరిశీలించటం వీలు కాదు కాబట్టి అప్పుడప్పుడు వ్యాఖ్యలు కనిపించటం ఆలస్యం కావచ్చును. తరచుగా జవాబులు ఇవ్వటం నాకు వీలు కాదు. ఎక్కువగా చర్చించటం అస్సలు వీలుకాదు.