రామనామముద్రాంచితమైన రమ్యమైన ఒక పాట
పామరులైనా పండితులైనా పరవశమందే పాట
పదముపదమున మధువులూరగ కదమును త్రొక్కే పాట
ముదమున సుజనులు కలసిపాడ మునుకొను నట్టి పాట
విదితయశుడు శ్రీరామచంద్రుని విజయము తెలిపే పాట
ఇది కద పాట ఇంపగు పాటని ఎల్లరు పొగడే పాట
అందరు కలిసి పాడేపాట అందమైన ఒక పాట
బృందారకసందోహమునకును వేడుకగొలిపే పాట
చందమామకన్నను చల్లని జానకిపతిపై పాట
వందనీయుడు రామచంద్రుడు భళియని మెచ్చే పాట
సాటిలేని శ్రీరామచంద్రుని చక్కగ పొగడే పాట
మేటిభావము తేటమాటల మెఱిసే చక్కని పాట
పాడరా ఓ సోదరా అట్టి పలుకులున్న ఒక పాట
ఆడవే ఓ చెల్లెలా ఆ అందాల పాటకు ఆట
31, మార్చి 2021, బుధవారం
రామనామముద్రాంచితమైన రమ్యమైన ఒక పాట
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి
కం. పలుకుడు పలికెడు నెడలను
పలుకుల విలువలకు మురిసి పలికెడు కళలో
నిల గడుగడు నిపుణులు తగ
పలికెడు తెఱగిటుల ననుచు పలుకగ విబుధుల్
(తెలుగులో వ్రాయటానికి అవసరమైతే లేఖిని సహాయం తీసుకోండి. Windows వాడేవారు ప్రముఖ్ IME డౌన్ లోడ్ చేసుకోవచ్చును )
గమనిక: అమోదించబడిన వ్యాఖ్యలు మాత్రమే ప్రచురించబడతాయి. తమ పరిచయం పొందుపరచకపోతే అజ్ఞాతల వ్యాఖ్యలు వెంటనే బుట్టదాఖలు అవుతాయి.