19, అక్టోబర్ 2026, సోమవారం

హరేరామ యనే శ్రీహరినామము


హరేరామ యనే శ్రీహరినామము
హరేకృష్ణ యనే శ్రీహరినామము

అతిసులభ మైనది హరినామము
అతిసుఖద మైనది హరినామము
అతిమధుర మైనది హరినామము
అతి విమల మైనది హరినామము

పరమసంపత్ప్రదము హరినామము
పరమశాంతిప్రదము హరినామము
పరమతేజఃప్రదము హరినామము
పరమధామప్రదము హరినామము

నిరుపమానధనము హరినామము
పరమయోగిహితము హరినామము
పరమేష్ఠి భావించు హరినామము
పరమశివుడు నుడువు హరినామము