అందరును నావారే ననుకోవయ్యా హరి
నందరిలో పెద్దబంధు వనుకోవయ్యా
ఆదుకొనే వాడు బంధు వనుకోవయ్యా హరి
యాదుకొన్నటుల నెవ్వ రాదుకొందురయ్యా
చేదోడై యెవరుండిన చెంతనెవరు లేకుండిన
ఆదుకొనుచు సన్నిహితుం డగుచు హరి యుండడా
ఆశ్రయము నిచ్చు బంధు వనుకోవయ్యా హరి
నాశ్రయించి జగము లున్నవనుచు తెలియవయ్యా
ఆశ్రయించ నెవరుండిన నస లెవ్వరు లేకుండిన
నాశ్రిత సంరక్షకుడై హరి చక్కగ నుండడా
పిలిచినపుడు పలుకువాడె పెద్దబంధుయయ్య యిన
కులతిలకా యనగానే పలుకు శ్రీరాముడయా
ఇల నీతో నెవరుండిన నెవ్వరు నిల లేకుండిన
కలనైనను నిను వీడక ఘనుడు హరి యుండడా