కం. నమ్ముడు మానుడు రాముని
నమ్మిన మానవుడు చెడడు నమ్మక చెడుచో
నమ్మనుజుని రక్షింపగ
నిమ్మహి రామునకు దప్ప నెవ్వరి తరమౌ
ఈ ప్రపంచంలో రాముణ్ణి నమ్ముకున్న వాడు చెడడు. నమ్మండి మానండి. ఇదే నిజం.
ఒక వేళ ఎవడన్నా రాముణ్ణి నమ్మకపోతే వాడు చెడిపోవచ్చును. నమ్మి మాత్రం ఎవరూ చెడరు.
ఎవడన్నా రాముణ్ణి నమ్మక చెడిపోతే వాణ్ణి ఎవరూ రక్షించలేరు.
ఒక్క రాముడే దయదలచి రక్షించాలి కాని మరెవరికీ అది తరం కాదు.