నీయందే సుగుణములు నిలువ మిక్కిలిగను
యెందెందో చూడనేల నినకులేశ్వర
యెందెందో చూడనేల నినకులేశ్వర
అందము గాంభీర్యము నౌన్నత్యము మూడింటి
నందరును గిరులలో చూచుచుందురు గాని
అందము గాంభీర్యము నౌన్నత్యము మూడును
ముందుగ శ్రీరామ నీయందు గాంచుదు
ఈవియును క్షమాగుణము నెన్నుదురు జనులు భూ
దేవి యందు నందరును తెలియ నటు కాక
ఈవియు క్షమాగుణము నీరెండును ముందుగా
భావించుచుందు శ్రీరామభద్ర నీలో