8, మార్చి 2024, శుక్రవారం

శివశివ శివశివ యనకుండగనే

 

శివశివ శివశివ యనకుండగనే శివదేవుని క్పప కలిగేనా

భవభవ భవభవ యనకుండగనే పరతత్త్వస్పృహ కలిగేనా


శ్రీరామచంద్రుని స్మరియించు చుండును శివదేవు డన్నది లోనెరిగి

ఆరుద్రు నెప్పుడు స్మరియించు చుండును హరియన్న మాటను లోనెరిగి


హరియనుచు వెలసిన హరుడనుచు వెలసిన పరమాత్ము డొకడిని లోనెరిగి

హరిహరులు వేరని తలపోయు వారికి  పరములేదన్నది లోనెరిగి


శివు డీయకుండగ శ్రీరామనామము జిహ్వపై నుండమి  లోనెరిగి

శివుడు దయచూపక శ్రీవిష్ణుతత్త్వము జీవునకు తోచమి లోనెరిగి