సుందరమగు నీమోమును చూడనీయరా బ్రహ్మా
నందప్రసాదమును నీవు నాకీయరా
సురవరు లతివినయంబుగ తరచుగ బహుతహతహతో
నరుగుదెంచి పొంది మురియు దరిశనమిడు చుండెడు
సురుచిరదరహాసముఖ నిరుపమ సుగుణాకర
పరమభక్తసులభ రామ పరమపురుష నేడు నీ
మునివరలను కూడను సమ్మోహపరచి యొప్పారెడు
సురవైరులు తేరిచూడ పరమభయదమై యొప్పెడు
వైదేహీముఖపద్మమునకు భానుబింబ మనగ నొప్పి
ఈదేహికి యజ్ఞానతిమిర మెల్ల బాపు రవి యైన