6, మార్చి 2024, బుధవారం

చక్కని వాడా రారా

 

చక్కని వాడా రారా నీకిదె మ్రొక్కెద రారా రామా

మక్కువ మీరగ మ్రొక్కెద రారా చక్కని వరముల నీరా


దేవతలందరు మ్రొక్కెడు రామా దేవదేవ హరి రారా

నీవే గురుడవు దైవము నాకు నీరజాక్ష యిటు రారా


భావనలో నిను పట్టటు యనగా బ్రహ్మకు వశమా రారా

నీవే దిక్కని నమ్మిన వాడను సేవలందుకొన రారా


సామాన్యుడను నిన్నే నమ్మితి నామొఱవిని యిటు రారా

స్వామీ భక్తుల సంరక్షించే రామచంద్రుడా రారా


శ్యామసుందరా సీతావల్లభ సంతోషముగా రారా 

కామితవరదా పామరుడను నను కటాక్షింపగా రారా


లోకము లన్నియు పొగడుచుండు హరి లోకరక్షకా రామా

శ్రీకర భవతారక నాపూజలు చేకొన సరగున రారా