నేడైనను రేపైనను నీవాడనే యెట్టి
కీడైనను మేలైనను కృప నీదేలే
జీవుడను యిలకు నేను చేరిన దాది
నీవు చూపుదారినే నేనడచునది
దేవదేవ రామ నీదు దివ్యలీలను మది
భావించి మురియుచుందు పరమేశ్వర
నీవాడు మనుచుంటివి నేనాడుచుంటిని
జీవులందరు నీయాటను పావులేగా
దేవదేవ మేలు కీడు తెలియ నొక్కటేగా
నీవినోదక్రీడ యందు నిజమెంచగను
ఏపావది పండుటెపుడొ యెఱుగుదువు నీవే
ఠీవిగ నందాక నాడుటే కార్యము
దేవదేవ రామచంద్ర దివ్యప్రభావ నీ
వేవిధి నన్నాడు మన్న నావిధి నాడుదును