5, మార్చి 2024, మంగళవారం

నన్నేల మనసురాదెయె


మన్నించి నన్నేల మనసురాదెయె శ్రీ

మన్నారయణ నీకు మరి యేమందు


వేదవిజ్ఞానంబు లేదాయె నాకు

వేదాంతజ్ఞానంబు లేదాయె

మీదుమిక్కిలి బుధ్ధి లేదాయె నాకు

నీదయ సుంతైన లేదాయె


శ్రీదయిత సద్భుధ్ధి లేదాయె వ్యర్ధ

వాదాల దుర్బుధ్ధి పోదాయె

మేదినిపై బ్రతుకు చేదాయె రామ

యేదారియును కనరాదాయె


ఈదేహ మోహంబు పోదాయె నిష్ఠ

నీదివ్యనామమున లేదాయె

నాదైన్యమున కంతులేదాయె నీవు

కాదన్న నిక గతిలేదాయె