కరుణామయుడ వగుచు హరి నీవు నాకుండ
పరమభక్తుడ నగుచు హరి నేను నీకుంటి
హరి నీదు సత్కీర్తి ధర నినుమడించగ
మురియుచు నేపాడ బుధులెల్ల మెచ్చగ
పరమాదరముతోడ హరి నీవు వినుచుండ
నిరతంబు నిను గూర్చి నేను పాడుచు నుంటి
జలజాక్ష బహుజన్మములుగ పాడుచునుంటి
అలుపుసొలుపును లేక హరి నీకు ప్రితిగ
అలుపు లేకను పాడ హరి నీవు వరమీయ
ఇల నిర్విరామముగ నిట్లు పాడుచు నుంటి
నీకునై పాడుటే నాకు మిక్కిలి ప్రియము
నీకనగ నాపాట నిశ్చయంబుగ ప్రియము
లోకత్రయారాధ్య లోకేశ శ్రీరామ
నాకేమి కావలెను నీకు నచ్చుట కన్న