| వేమారులు కలిగితిని వేమారులు తొలగితిని ఈ మాయను తెలిసితిని రామా యని పలికితిని |
|
| తనువులపై మోహంబుల తనయులపై మోహంబుల ధనములపై మోహంబుల ననయము గొని తిరుగుచు నే |
॥వేమారులు॥ |
| దుర్మదముల ఫలితంబుల కర్మనిష్ఠ ఫలితంబుల ధర్మదృష్టి ఫలితంబుల మర్మంబుల తెలియుచు నే |
॥వేమారులు॥ |
| విడచితి పాపము పుణ్యము విడచితి సుఖమును దుఃఖము విడచితి నీకై సర్వము తడవేలా దయచూడుము |
॥వేమారులు॥ |
21, ఏప్రిల్ 2015, మంగళవారం
రామా యని పలికితిని..
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
పోస్ట్లు (Atom)