నీ గుడివాకిట నిలచితి నింతలో ఆగితి నిదె లో నడుగిడ దగుదునో |
|
మానవుడను దుర్మానిని నేను కానిపనులను కపటంబులను మానగ లేని మతిహీనుడను ఏనాటికి మన్నించి దిద్దుదువొ |
॥నీ గుడివాకిట॥ |
ధర్మము నెఱిగి యధర్మము నెఱిగి ధర్మమార్గమును తలదాల్చనుగా కర్మమెట్టిదో కట్టుబడితి నీ ధర్మేతరమున దయజూపవయా |
॥నీ గుడివాకిట॥ |
అన్నియు తెలిసి న న్నేమనని నిను కన్నుల జూడగ కడు సిగ్గాయెను నిన్నే నమ్మితి నీవే దిక్కిక ఎన్నడు యోగ్యత నిచ్చెదో రామ |
॥నీ గుడివాకిట॥ |
9, జనవరి 2014, గురువారం
నీ గుడివాకిట నిలచితిని
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
పోస్ట్లు (Atom)