22, ఫిబ్రవరి 2026, ఆదివారం
రామజయం
21, ఫిబ్రవరి 2026, శనివారం
సేవకులము
రారా రాఘవ
15, ఫిబ్రవరి 2026, ఆదివారం
ఏమి కావలెను నీకు
రామున కన్యము నేమెరుగవు యిం
కేమి కావలయు నిప్పుడు నీకు
రాముని భక్తుడ వైతివిగా
యింకేమి కావలెను నీకు
రాముని సేవను కుదురుకొంటి
వింకేమి కావలెను నీకు
రాముని భక్తుల మైత్రి కల్గె
నింకేమి కావలెను నీకు
రాముని భజనకు నురుకుచుందు
వింకేమి కావలెను నీకు
రామనామమునె పలుకు జిహ్వ
యింకేమి కావలెను నీకు
రామతత్త్వమునె తలచు బుధ్ధి
యింకేమి కావలెను నీకు
రామరూపమునె వలచును కను
లింకేమి కావలెను నీకు
రామచరితమునె తడవును మది
యింకేమి కావలెను నీకు
రామకీర్తనమె చేయు భావ
మింకేమి కావలెను నీకు
రాముని తోడనె గడచు కాల
మింకేమి కావలెను నీకు
రాముని పాదము వీడవుగా
యింకేమి కావలెను నీకు
రాముని బ్రతుకున నిండించితి
వింకేమి కావలెను నీకు
మంచితనము
11, ఫిబ్రవరి 2026, బుధవారం
నా పరిస్థితి.
మూడవ తారీఖున ఉదయం రోడ్ దాటుతుంటే స్కూటరు వచ్చి తాకి పడ్డాను. కొంచెం కముకుదెబ్బలు తగిలాయి. మాచెల్లెళ్ళు వచ్చి లాక్కుపోయారు. నాతల్లులు వాళ్ళే నాసంరక్షణ చూస్తున్నారు శారద గతించినప్పటి నుండీ.
ఇపుడు వాళ్ళ ఇంటికి సమీపంలోనికి నన్ను మార్చాలని వాళ్ళ తీర్మానం. రెండునెలల క్రితం ఇంట్లోనే పడిపోయాను కదా. ఇపు డిది. ఇక నన్ను ఒక్కడినే బయట తిగుగనీయ వద్దని కూడా తీర్మానించారు.
శారద వెళ్ళపోయాక కొంచెం మానసికంగా దెబ్బతినటం వలన ఈఫరిస్థితి వవ్చిందేమో అని నా అనుమానం.
మొదట కొంత కులాసాగానే ఉన్నాను. మందులు వాడుతున్నాను.
క్రమంగా రెండడుగులు ముందుకూ మూడడుగలు వెనక్కీ అన్నట్లుంది నా పరిస్థితి. మందులు ఇంకా వాడుతున్నాను. మొదట కుడిచేతి x - ray తీయించారు. అది బాగుంది. కాని నొప్పులు బాగానే ఉన్నాయి.
కాలిపరిస్థితి అంత మెరుగుకాలేదే అని డాక్టరును కలిసి మాట్లాడాము. నిన్న x- ray తీస్తే కొంచెం fracture ఉందని అన్నాడు technician.
నిన్న మాబావగారు నా రిపోర్టులతో డాక్టరును కలిసారు. డాక్టర్ నాతో కూడా ఫోనులో మాట్లాడారు.
కుడిమోకాలికీ పాదానికీ మధ్యభాగంలో కుడివైపున చిన్న hairline fracture అన్నారు.
ఒక ఐదారువారాలు బెడ్ రెష్ట్ అవసరం అన్నారు. మాచెల్లెలు లక్ష్మి యింట్లో ఉన్నాను.