వీడేమి చేసేనమ్మా వీడు
నేడేమి చేసేనమ్మా
నిన్న కడివెడు పాలు వెన్నమీగడలన్ని
తిన్నంతతిని అన్నీ తన్నిపోయేనమ్మ
కన్నులు గప్పివచ్చు వెన్నదొంగను బట్ట
ఎన్ని చేసినగాని యన్నీ వృథయై పోయె
అన్ని యిండ్లను దూరి యన్నిపాలనుత్రాగి
అన్ని దుత్తలలోని వెన్నలు తినుటేమి
నిన్న మాయింటికి రాలేదన్న సుదతి లేదే
ఎన్నడు నిట్టివి వింతలు విన్నదే లేదోయమ్మ
తిన్నగ వాని పండువెన్నెల వంటినవ్వు
కన్నులజూచి మురియుచున్నాము వాని రాక
అన్నులమిన్నలార ఆనందమే గొలుప
ఎన్నకతప్పు లందరమున్నాము కాదటమ్మ
శ్యామలరావు గారు,
రిప్లయితొలగించండిఒక సందేహం ఆండీ. సిల్లీ గా అనిపించవచ్చేమో? శ్రీరాముడికి వారి తల్లిదండ్రులు చేసిన అసలు నామకరణం (official name) ఏమిటండీ?
अतीत्यैकादशाहं तु नामकर्म तथाकरोत् |
తొలగించండిज्येष्ठं रामं महात्मानं भरतं कैकयीसुतम् || १-१८-२१
सौमित्री लक्ष्मणमिति शत्रुघ्नमपरं तथा |
वसिष्ठः परमप्रीतो नामानि कुरुते तदा || १-१८-२२
బాలకాండ లోని ఈశ్లోకాల ప్రకారం రాముడు అనే నామకరణం చేసారు వసిష్టుల వారు.