ప్రసాద్ ఆత్రేయ.
మంచి కవి, పండితులు.
కొన్ని పుస్తకాలు ప్రచురించారు.
ఒకప్పుడు హైదరాబాదులో ఈ.సీ.ఐ.యల్. కంపెనీలో పెద్ద ఉద్యోగం చేసి పదవీవిరమణ చేసారు.
ప్రస్తుతం విశాఖపట్నం వాస్తవ్యులు.
హోమ్ క్వారంటైన్ ఆయన పరిస్థితి.
కరోనాకు ఎవరైనా ఒకటే.
ఆయన నాకన్నా చాలా పెద్ద వారు.
నాకు చాలా ఆత్మీయులు.
నాకు మేనమామ గారు. అంటే మా అమ్మమ్మ గారి సోదరి కుమారులు.
ఆయన కొడుకుల్లో ఒకడు అమెరికా మనిషి.
మరొక కొడుకు విశాఖపట్నం లోనే ఉంటాడు.
"రాడు. వాడిని చూసి పదకొండేళ్ళైంది" అంటా రీయన.
ఐనా ఇప్పుడు ఎవరు వస్తారు? ఎవరు పలకరిస్తారు.
సొంత అపార్ట్మెంట్ లోపల ఒంటిరిగా బేలగా ఉన్నారు.
కరోనా వస్తూనే ఒంటరితనాన్ని బహుమానంగా ఇస్తుంది.
హాస్పిటల్ వైద్యం వి.ఐ.పీలు కాని వాళ్ళకి దుర్భరమైన జనరల్ వార్డు సౌకర్యం రూపంలో మాత్రమే అందుబాటులో ఉంది.
ఇతరులు స్పెషల్ రూమ్ తీసుకుంటే వైద్యం బాగుంటుందేమో తెలియదు.
కాని ఇల్లూ ఒళ్ళు గుల్ల అవటం అన్నది ఖాయం.
ఆ స్పెషల్ అందని అందాల చందమామే మన బోటి సామాన్యులకు.
ఈ దేశంలో ముసలాళ్ళు టాక్సులు కట్టటానికీ, వైద్యశాలకు బిల్లులు కట్టుకకోవటానికీ ఉన్నారు.
వి.వి.ఐ.పీలో, కాకపోతే కనీసం వి.ఐ.పీలో కాని ముసలి వాళ్ళ గురించి ఎవరూ పట్టించుకోరు దేశంలో.
ఈమాట శంకరులు ఎప్పుడో చెప్పారు.
ఇప్పుడు ప్రసాద్ గారిని చూసే వాళ్ళెవరూ లేరు.
సరైన సదుపాయాలు లేవు.
వేళకింత సరైన ఆహారమూ అందించే వారు లేరు.
సరైన వైద్యం చెసే వారూ లేదు.
నా కింకేం మాట్లాడాలో తెలియటం లేదు.
అరరె.
రిప్లయితొలగించండిమరి, మందులు వాడక పోతే ఎలా? పోనీ, వెళ్ళి KGH లో అడ్మిట్ అవడానికి ప్రయత్నించడానికి వీలవదా? (ప్రైవేట్ హాస్పిటల్స్ లో అంటే ఆ ఫీజులు వగైరా భరించుకోలేక పోవచ్చు).
అవును మీరన్నది నిజం (Senior Citizens) టాక్సులు కట్టడానికి మాత్రమే ఉపయోగపడుతున్నట్లున్నారు
ప్రభుత్వానికి.
అక్కడ ప్రభుత్వం వారి హాస్పిటల్ వార్డుల్లో శానిటరీ కండిషన్లు భయంకరంగా ఉన్నాయి కాబట్టి హోం క్వారంటైన్ తీసుకున్నా అంటున్నారు.
తొలగించండిWishing him quick recovery & all the best sir
రిప్లయితొలగించండికొంత మంది సంఘ సేవకులు ఇలా వంటరీ వారికి ఆహారం మందులు అందిస్తున్నారు, కొంతమంది ఉపాధి గా కూడా అడ్రస్ నాకు తెలియదు కాని ప్రయత్నిస్తే విశాఖ మహానగరంలో ఇలాంటి వారు దొరకవచ్చూ.ఆయన ధైర్యంగా ,ఆరోగ్యం గా వుండాలని భగవంతుని ప్రార్ధిచడమే మనం చేయగలిగింది.
రిప్లయితొలగించండివిశాఖపట్నంలో దేవీ పట్నం దగ్గరలో "వానప్రస్థ" అనే ఆశ్రమం ఉంది. అక్కడ మంచి వసతులు ఉన్నాయి. విడిగా రూములు ఉన్నాయి. వారు ఆర్ధికంగా భరించగలిగే స్థితిలో ఉంటే ఒంటరిగా ఉండటం కంటే అక్కడ చేరటం మంచిది. ఇపుడు కరోనా పేషెంట్స్ ని చేర్చుకుంటారో లేదో నాకు తెలియదు.ఒకసారి ప్రయత్నించమని చెప్పండి.
రిప్లయితొలగించండినీహారిక గారు,
రిప్లయితొలగించండివిశాఖపట్నంలో “దేవీ పట్నం” ఎక్కడుందండీ 🤔? నాలాంటి వాడు గుర్తు పట్టడం కోసం ఆ చుట్టుపక్కల మరేదన్నా పెద్ద ఏరియా పేరు చెప్పండి మీకు తెలిస్తే.
మీరన్నది కరక్టే. ఇప్పుడు కరోనా పేషెంట్లను జేర్చుకోకపోవచ్చు. ఎందుకంటే ఆ ఆశ్రమంలోని తతిమ్మా వాసులకు రిస్క్ కదా? అసలు ఉంటున్న వాళ్ళనే పంపించేస్తున్నారేమో కొన్ని ఆశ్రమాల్లో అని నా అనుమానం / ఎక్కడో చదివినట్లు గుర్తున్నూ.
మీరిచ్చినది మంచి సలహానే no doubt .... మామూలు పరిస్ధితులలో. ప్రస్తుత కరోనా టైములో వర్కవుట్ కాకపోవచ్చేమో? అయినప్పటికీ శ్యామలరావు గారి మేనమామ గారు ఆ ఆశ్రమానికి ఓసారి ఫోన్ చేసి కనుక్కోవచ్చేమో?
శ్యామల్ రావు గారు..
రిప్లయితొలగించండిఇది తెలిసి ఒకింత బాధ కలిగింది..
విశాఖపట్నం నలుమూలల ఈ మహమ్మారి ముంచుకొస్తున్న తరుణాన చెస్ట్ హాస్పిటల్ గాని కేజీఎచ్ వంటి ఆసుపత్రుల్లో కూడా సరైన శానిటేషన్ లేవన్నది ఒకింత నిజమే.. సెల్ఫ్ క్వారెంటైన్, ఐసోలేషన్ మూలాన కాస్తో కూస్తో ఆ కరోన రక్కసిని కట్టడి చేసే దశగా డాక్టర్లు సైతం వెనకంజ వేయకుండ వారి నిరంతర ప్రయత్నం చేస్తూనే ఉన్నారు. ఇపుడు ఎక్కువ శాతం ప్రబలేది హాస్పిటల్స్ వలనే అని ఎక్కువ మంది వారికి వారే ఐసోలేట్ అవుతున్నారట.. కాని వయసు పైబడిన వారి చెంతన ఉండి విడియో కాన్ఫరెన్స్ ద్వారైనా పలకరిస్తు ఉంటే వారికి మనోధైర్యంగా ఉంటుంది.
1. Turmeric + Zandu Balm or Zinda Tilismat + Hot Water Steamer Inhalation for about 10 minutes per day may clear Nose Blockage/Runny Nose.
2. A Potion made with Pinch of Cumin, Pinch of Coriander Seeds, Basil Leaves, Cardamom, Cinnamon, Turmeric and Fenugreek can help Ease out Sore Throat.
3. A Cup of Millet Soup, A Mix of Dry Fruits, Fresh Vegetables, Paneer and Milk can provide a boost in Immunity.
Home Quarantine or Isolation around 14-20 days with proper medication and timely intervention may prove effective in attenuating the effects of CoViD upto certain extent.
ధన్యవాదాలండీ. మీ సందేశం మా మావయ్యగారికి పంపుతాను.
తొలగించండిsri(dharani)tha: Aug 17, 2020, 10:21 PM
రిప్లయితొలగించండిఅనట్లు ఆచార్య.. ఈ కరోన లక్షణాలు నికచ్చిగా అవే అని తెలిజేసే సిమ్ టమ్స్ కొన్ని నాకు ఇతరులు చెప్పగా తెలిసింది.. అది అందరికి కూడా ఉపయోగ పడుతుందని తెలియ జేస్తున్నాను.. కరోనా ర్యాపిడ్ యాంటిజెన్ టెస్ట్ "ర్యాట్" కిట్ కన్న మునుపే ఆ వ్యాధి లక్షణాలను ఇట్టే తెలుసుకుని సిమ్ టమ్స్ తెలియ వచ్చిన సెవెన్టీ టూ హవర్స్ నిడివి లోపే చికిత్స మొదలుపెడితే కొద్దిలో కొద్ది లక్షణాలు తగ్గుముఖం పట్టవచ్చు.. ఆ సిమ్ టమ్ ఏమంటే.. సదరు వ్యక్తి ఎటువంటి వాసన ఘ్రాణించలేరు (వాసన పసిగట్టలేరు).. ఏమి తిన్నా రుచి పచి తెలియదు.. ఆ సమయంలో "ర్యాట్" కోసం పూనుకుని మల్టివిటమిన్ ట్యాబ్లెట్, జింకోవిట్, హైడ్రాక్సి క్లోరోక్విన్ (ఇపుడిది వాడుతున్నారో లేదో తెలియదు), వేపాకు కషాయం, లేదా కాకర కాయ కషాయం, వేప తులసి మిశ్రమం పుచ్చుకుంటు ఉంటే కూడా కొంతమేరకు ఉపయుక్తమే..!
ధన్యవాదాలు దేనికి శ్యామల్ రావు సర్.. మీవంటి వారి ఆశిస్సులుంటే చాలు. మీ మామయ్య గారు త్వరిత గతిన కోలుకోవాలని కాంక్షిస్తు..!
దేవీ పట్నం అని తప్పుగా వ్రాసాను. దేవీ పురం. అక్కడ ఒక అమ్మవారి ఆలయం ఉంది. అనకాపల్లి నుండి 18 కి మీ.
రిప్లయితొలగించండిhttps://youtu.be/K5cPez8J1o4
సరైన ఊరి పేరు ఇచ్చినందుకు థాంక్స్, నీహారిక గారు.
తొలగించండివిచారకరమైన వార్త. ఆయన త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నాను.
రిప్లయితొలగించండిఒంటరి జీవితం కష్టమే.
వృద్ధుల సంక్షేమం గురించి ఏ పార్టీ తమ ప్రణాళికలో మాట్లాడదు.
ఓల్డ్ ఏజ్ హోమ్స్ గురించి వెతకాలి మేము కూడా.
పది రోజులు పైన గడిచింది, ఇప్పుడు పెద్దాయన పూర్తిగా కోలుకున్నారని ఆశిస్తాను.
రిప్లయితొలగించండిఆయన చెప్పిన ప్రకారం మా మావయ్య గారి క్వారంటైన్ ఈరోజుతో పూర్తయింది. టెస్ట్ ఫార్మాలిటీస్ పూర్తి కావాలనుకుంటాను. ప్రస్తుతం బాగానే ఉన్నానంటున్నారు.
తొలగించండిచాలా సంతోషం గురువు గారూ.
తొలగించండి