"రాధేయుడు అంటే కర్ణుడు కదా
ఇక్కడ గుడిలో ప్రవచనాలు చెబుతుంది ఒకావిడ.కృష్ణుడు అంటోంది.నిజమేనా"
పైన ఉన్నది వాట్సాప్‌లో మాచెల్లెలు అరుణ పంపిన ప్రశ్న.
మా చెల్లెలికి నేను చెప్పిన మాటలు
"పరమశుంఠలు సభాపూజ్యులైరి ఒక శతకకారుడు అన్నాడు. దాని అర్ధం ఇదే. కుంతి కొడుకు కర్ణుడిని అతిరథుడు అనే సూతుడు గంగలో దొరికితే తీసుకొని వెళ్ళి తనభార్య ఐన రాధ చేతికి ఇచ్చాడు. అలా కర్ణుడు రాధేయుడు అంటే రాధకొడుకు అయ్యాడు. ఈసంగతి మనదేశంలో అందరికీ తెలుసును. ఇదిగో కొత్తకొత్త గురువులు వస్తున్నారు. జాగ్రత జాగ్రత అని పిల్లలకి చెప్పాలి మర్చిపోకు."
ఇంత చక్కని గురువును జనానికి పరిచయం చేయకపోతే ఎలా అని అనిపించి ఈముక్కలు బ్లాగులో వ్రాస్తున్నాను.
ప్రజలారా తస్మాత్ జాగ్రత. కొత్త గురువుల నుండి పిల్లలను కాపాడుకోండి!
రిప్లయితొలగించండిఆ "గురోన్మణి" నామధేయ మేమి :)
శకార సోదరి
తొలగించండిహ్హ హ్హ హ్హ, శర్మ గారు, భలే వ్యంగాస్త్రం వేశారు 😁😁
తొలగించండిఆ గురుశిఖామణి ఊరూపేరూ ఇంకా తెలియరాలేదు. ప్రస్తుతానికి ఏదో స్వాధ్యాయ ఉమెన్ సెంటర్ అని తెలిసింది. హైదరాబాదు లోనే లెండి.
తొలగించండికాళిదాసు కవిత్వం కొంత, నా పైత్యం కొంత ... అన్నట్లు తయారైంది అటువంటి వాళ్ళ పద్ధతి,, శ్యామలరావు గారూ. కీర్తి కండూతి?
రిప్లయితొలగించండిఅవునండీ అంతే. ఆమధ్య బ్రహ్మకుమారీ వాళ్ళు కూడా ఒక బ్లాగు నడిపించే వారు. శివబాబా అంటూ శివుణ్ణి పెద్ద చేస్తూ. అదే మంత తప్పు కాదు కానీ, భగవద్గీతను చెప్పింది కృష్ణుడు కాదు శివుడూ అంటే ఎలా. పైగా కృష్ణుడికి ఏమీ తెలియదన్నట్లు విమర్శలూ చేయటం. నా తాకిడిని చూసి మోడరేషన్ పెట్టారు. ఇప్పుడు వ్రాయటం లేదు. ఇలాంటి సమాజాలు బోలెడు. మీరు ఒక కోడలి కథ చదవండి ఇలాంటి వ్యవహారాల గురించి వ్రాసినది.
తొలగించండికథ చదివానండి. అటువంటి సోకాల్డ్ “గురువులను” ఆంగ్లంలో charlatans అంటారు అనుకుంటాను. స్వయంప్రకటిత గురువులను / స్వామీజీలను గుడ్డిగా అనుసరించే జనాల గురించి బాగా వ్రాశారు. మీరు వ్రాసినది ముమ్మాటికీ నిజం. ఆలోచన లేని అటువంటి అనుచరులకు కొదవేమీ లేదు అనిపిస్తుంది. ఆ స్వామీజీలకు / గురువులకూ కోట్లల్లో ఆదాయం కదా?
రిప్లయితొలగించండిఒక పరాయి రాష్ట్ర “స్వామీజీ” మైకంలో పడి కొట్టుకుపోతున్న తెలుగు కుటుంబాలు కొన్ని నాకు తెలుసు. వాళ్ళ ఇంటికి వెడితే సింహద్వారం దగ్గర నుండి ఇల్లంతా ఆ సోకాల్డ్ “స్వామి” ఫొటోలే కవిపిస్తాయి .... గోడల మీద, బల్లల మీద, టీవీ మీద, ఫ్రిజ్ మీద షెల్ఫుల్లో ... ఏ ఖాళీ జాగానూ వదలకుండా. పూజలో వాళ్ళు వేసుకునే కండువా మీద, మామూలుగా వాడే సంచీల మీద ... ఒకటనేమిటి, అన్నిటి మీదానూ (ఈ సామగ్రి ఆ “స్వామీజీ” కేంద్రం వారే అమ్ముతారనుకుంటాను). షెల్ఫుల నిండా ఆ పుస్తకాలూ, పత్రికలే. ఫోన్ రింగ్ టోనూ అదే, పలకరింపూ అదే. మీ కథలోని కోడలులాగా ప్రశ్నించే అవకాశం తక్కువ .... ఎందుకంటే పెళ్ళి సంబంధాలు కూడా ఆ సర్కిల్ లో తిరుగుతున్న వాళ్ళలోనే ఆ “స్వామీజీ” సూచించిన సంబంధాన్నే మహదానందంగా అంగికరిస్తారట ... ఇంక ఇబ్బందేముంటుంది 🙂?
అసలు ఇటువంటి మార్గంలోకి ముందుగా ఇంటి ఆడవారిని ఆకర్షించడానికి ప్రయత్నం జరుగుతుందని నా గట్టి అనుమానం. ఎందుకంటే ఇంట్లో ఆడవాళ్ళు ఏదో చేసుకుంటున్నారులే వాళ్ళ నమ్మకం వాళ్ళది అని ఒక విధమైన లిబరల్ దృష్టితో చూస్తూ సాధారణంగా ఇంటి మగవాళ్ళ పెద్దగా పట్చించుకోరు, అభ్యంతర పెట్టరు కదా? చివరకు క్రమేణా అదే మగవాళ్ళను కూడా ఆ మాయ లోనికి లాగే అవకాశం ఉండవచ్చు కదా?
సరే, ఎవరిష్టం వారిది అనే వాదన ఉందని తెలిసినా అటువంటి మనుషులను చూస్తుంటే వీళ్ళకు స్వంత ఆలోచన అంటూ ఉండదా అని అనుమానం కలుగుతుంటుంది ... నాకైతే.
దేవుడు నమ్మకం, స్వాములు, బాబాలు మూఢ నమ్మకం. నా దృష్టిలో ఈ స్వాములు, బాబాలు దైవసమానులు (GOD MEN) కారు. వీళ్ళు కేవలం దళారులు. వీళ్ళ దగ్గరకు వెళ్ళే వాళ్ళు అమాయకులు, అజ్ఞానులు అయినా అయి ఉండాలి లేకపోతే ఆ వ్యవహారంలో స్వప్రయోజనం ఉన్న స్వార్థపరులు అయినా అయి ఉండాలి.
రిప్లయితొలగించండిఈ రోజుల్లో ఆధ్యాత్మికవ్యాపారం ఒక పెద్ద స్థాయి వ్యాపారం. ఎంత పెద్దదంటే అదొక మాఫియా. దాని జోలికి వ్యతిరేకభావంతో వెళ్ళేవారికి తరచూ మానహానీ ప్రాణభయమూ కలుగుతాయి. ఈ వ్యాపారం నిర్వహించే కార్యకలాపాలకు దేశాధినేతలే అందుబాటులో ఉంటారంటే వారిస్థాయిని ఊహించుకోండి.
తొలగించండి