తే.గీ. ఆ యయోధ్యాపురమున శుధ్ధాంతకాంత
లమితముదమున మధ్యాహ్న సమయమందు
చిలుకలకు రామశబ్దంబు చెప్ప వినుచు
పులకరించెడు సీతమ్మ ప్రోచుగాక
(వ్రాసిన తేదీ: 2013-5-20)
లమితముదమున మధ్యాహ్న సమయమందు
చిలుకలకు రామశబ్దంబు చెప్ప వినుచు
పులకరించెడు సీతమ్మ ప్రోచుగాక
(వ్రాసిన తేదీ: 2013-5-20)
సర్, చదివె శక్తి ఉంది కానీ, అర్థం చేసుకొనే అంతటి పాండిత్యం లేదు, అది కూదా రాస్తే బాగుంటుంది.
రిప్లయితొలగించండిఫాతిమాగారూ, సుస్వాగతం.
తొలగించండిరెండువారాల్లో ఇదే పాఠకులనుండి వచ్చిన మొదటి వ్యాఖ్య.
నిజానికి నాకు ఈ శీర్షికలో పద్యాలతో పాటు వాటు భావాలనూ వ్రాయటం అనేది ఇబ్బందికరమైన విషయం. అలా చేయటం సంప్రదాయం కాదు. సాధారణంగా కవులు తమ కృతులను వ్యాఖ్యానించుకోవటం జరగదు. అందుచేత సంకోచిస్తున్నాను.వేరే యెవరైనా వ్యాఖ్యానం వ్రాస్తే బాగుంటుంది.
( నిజానికి సాంప్రదాయిక తెలుగు కవిత్వంలో అనేకకారణాలవలన సంస్కృతంపాలు హెచ్చు. బహుశః తొలిరోజుల్లో జనం ఇదం బ్రాహ్మ్యం ఇదం క్షాత్రం అన్నట్లు తెలుగులో సంస్కృతాన్ని ధారాలంగా కలిపి మాట్లాడటం వలన నేమో. అయితే రానురాను ఆధునిక కాలంలో సంస్కృతం వాడుక చాలా తగ్గింది వాడుకభాషలో. సంస్కృతం అనేముంది లెండి, ఈ రోజుల్లో తెలుగుభాష వాడుకే తగ్గిపోతున్నది. అందుచేత నేను సాధ్యమైనంతగా సంస్కృతపదాలను తగ్గించి వాడుతున్నాను. కాని పూర్తిగా కాదని ఒప్పుకోవలసి ఉంది.)
ప్రస్తుతానికి యీ పద్యం భావం.
అది అయోధ్యానగరం. శ్రీరామచంద్రులవారి రాజ్యానికి రాజధాని. మనం అంతఃపురం లోకి తొంగిచూదాం. అక్కడ రాజకుటుంబం వారి పరివారం, దాని తాలూకు కాపలాదారులూ తప్ప అన్యులు ఉండరు. శుధ్ధాంతం అంటే అంతఃపురంలోపలి భాగం. అక్కడ జరుగుతున్న కథను ప్రస్తావిస్తున్నాను. అది మధ్యాహ్నసమయం. అందరి భోజనాదులూ పూర్తయాక విశ్రాంతి తీసుకుంటున్నారు. ఆ తీరిక సమయంలో, కొందరు సీతమ్మవారి చెలికత్తెలు పెంపుడు చిలకలకు మాటలు నేర్పుతున్నారు. వాటి చేత రామ రామ రామ అని పలికిస్తుంటే అవి తిరిగి అప్పగిస్తున్నాయి ఆ మాటల్ని. సీతమ్మ వారు అక్కడే ఉండి అంతా గమనిస్తూనే ఉన్నారు. ఆవిడకు రాముడే ప్రాణం. రామ రామ అంటూ చెలికత్తెలూ చిలకలూ పదే పదే అంటూంటే ఆవిడకు ఒళ్ళంతా పులకరించుతోంది. ఆవిడకు పరమసంతోషంగా ఉంది ఈ కాలక్షేపం. అలా సంతోషంలో తలమునకలుగా ఉన్న సీతమ్మతల్లి మనను రక్షించు గాక అని ఆశిస్తున్నాము.
ఈ 'పాహి రామప్రభో' పద్యశీర్షీకను ఆదరిస్తున్నందుకు మీకు నా హృదయపూర్వకమైన ధన్యవాదాలు.
తేటగీతిని ఆటలాడుతూ, ఆటవెలదుల పాట పాడుతూ, రామ పావన గాన లహరిని లీలగా మాకందిస్తున్న మీకు (మీ బ్లాగుకు)నా మదిలో మెదిలిన మరో చిన్న పెద్ద పేరు - రామశ్యామలీయం !!
రిప్లయితొలగించండిసంతోషం.
తొలగించండి