5, మే 2013, ఆదివారం

బ్రతుకుము రామచంద్రు వలె

చ. బ్రతుకుము రామచంద్రు వలె పాయక ధర్మము నెల్ల వేళలన్
బ్రతుకగ రాదు రావణుని భంగిని గొల్చుచు నర్థకామముల్
సతతము ధర్మనిష్ఠ గల సజ్జను చేరును మోక్షలక్షియున్
మతిచెడి యర్థకామముల మానక గొల్చిన నారకం బగున్

(వ్రాసిన తేదీ: 2013-5-1)

6 కామెంట్‌లు:

  1. Sir,
    miku dannam pedataamu. Praveen, Mauli, komdala rao la to praja blog carcim cakamdi.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. > సర్, మీకు దండం పెడతాను. ప్రవీణ్, మౌళి, కొండలరావులతో ప్రజాబ్లాగులో చర్చించకండి.
      నాకు అర్థమైనంతవరకూ మీ ఆవేదనకు కారణం కొన్ని చర్చలు ఆవేశపూరితంగా ఉండి ఆస్తికులకు మనస్తాపం కలిగిస్తూ ఉండటం. ఒప్పుకుంటాను. నాకు కూడా అనేక సార్లు బాగా విరక్తి కలుగుతూ ఉంటుంది. కాని నాబోటి మీబోటి వారి దృక్పధాలు తెలియజేసే పరిస్థితిలేకపోతే చర్చలు యేకపక్షంగా సాగుతాయి. దురభిప్రాయాలకు మరింత ప్రచారం దొరకుతుంది. అందుకని సాధ్యమైనంతవరకు ఆవేశరహితంగా నామాట చెప్పటానికి పరిమితం అవాలని ప్రయత్నిస్తున్నాను. సఫలీకృతుడను కాలేకపోతున్నాను కూడా.

      మొన్ననే ఒక చర్చను చూసాను వేరే బ్లాగులో. అందులో వాలివధగురించి పేద్ద (174 వ్యాఖ్యలతో) చర్చ నడిచింది. ఒక పెద్దమనిషి రాముడు ఒక పిచ్చికుక్క అన్నాడు. ఇది పథ్థతి కాదు కదా. కాని చర్చకు ముగింపులో మరొకాయన చక్కగా ఆరోగ్యకరమైన చర్చ నడిచింది అని వ్యాఖ్యానించారు. ఇలా ఉంది లోకం.

      నాకేమి చేయాలో పాలుబోవటం లేదు. తరచుగా బ్లాగులూ చర్చలూ చదవటం దేనికీ బాధపడటం దేనికీ అని మథనపడుతున్నాను.

      తొలగించండి
  2. మీరనుకొనే ఆస్తికులేవరో నాకు తెలియదు. కనిపించిన వాళ్ళందరినీ నాస్తికులక్రిందజమకట్టి మీరేం బావుకుంటారో తెలియదు .
    మీకు వాల్మీకి వ్రాసినదానికి, సినిమాలో పాట కు బేధం తెలియక ఆవేశ పడ్డారు . చర్చ కేవలం సినిమా పాత గురించి జరుగగా , మీరు చెప్పిన తరువాత ఆ వాక్యానికి మూలం తెలిసింది కాని సినిమాలో అర్ధాన్ని మార్చి వాడుకొన్నారు, అందుకే అది సైన్యానికి వర్తించింది. మీరు చెప్పకపోతే చివరగా నేనే వికిలో నుండి తెచ్చి మరీ వివరణ ఇచ్చాను . మీరే మొదట తొందరపాటు లో చేసిన పొరపాటు సరిదిద్దుకోకపోతే పోనే . ఇలాంటి అజ్నాతల చెప్పుడుమాట లకు లొంగిపొతారని ఊహించలేదు . అయినా వీళ్ళేదో మీ బోటి వాళ్లకి చాటు మాటుగా నూరి పోస్తారనుకోన్నాము కాని, పాపం మీరు వారికా అవకాసం ఎక్కడా ఇచ్చినట్లు లేరు .

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. మౌళిగారూ, మీకు స్వాగతం.
      ౧. కనిపించిన వాళ్ళందరినీ నాస్తికులక్రిందజమకట్టి తూలనాడే టంత అజ్ఞానిని కాను. మీకా అభిప్రాయం కలిగినందుకు విచారిస్తున్నాను.
      ౨. మీరు ప్రస్తావించిన చర్చ నా యీ శ్యామలీయం బ్లాగులోనిది కాదు. కాబట్టి దయచేసి ఇక్కడ దాన్ని గురించి చర్చ కొనసాగించవద్దని ప్రార్థన. వీలు వెంబడి ఆ చర్చలో మరికొన్ని ముఖ్యవిషయాలు జమచేస్తాను. నాకు యెవరూ యేమీ నూరిపోయటం లేదని నిశ్చింతగా ఉండండి.త ప్రమాదో ధీమతా మపి. నేనెంత. తప్పులు తప్పకుండా దిద్దుకుంటాను. ప్రస్తుతం నా ఆరోగ్యరీత్యా వ్రాయటానికి చేతులకి ఇబ్బందిగా ఉంది.

      తొలగించండి
    2. విషయం పరిజ్ణానం లేకుండా, చర్చల పేరుతో పగలు రాత్రి వ్యాఖ్యలు రాస్తూ బ్లాగు లోకంలో కొందరు తలకాయనొప్పిగా తయారయ్యారు. వీళ్లకు సిగ్గు, లజ్జా అనేవి ఉన్నాయా!?

      తొలగించండి
    3. వారు వారి పని చేస్తూ‌ పోతున్నారు. అది మనకు ఆమోదయోగ్యం కాక పోవచ్చును.
      మనం మన పని చేసుకు పోదాం. అది వారికి ఆమోదయోగ్యం కాక పోయినా సరే.
      They go to their church and we go to ours!

      తొలగించండి

ఆమోదించిన వ్యాఖ్యలే ప్రచురితం అవుతాయి. తరచుగా పరిశీలించటం వీలు కాదు కాబట్టి అప్పుడప్పుడు వ్యాఖ్యలు కనిపించటం ఆలస్యం కావచ్చును. తరచుగా జవాబులు ఇవ్వటం నాకు వీలు కాదు. ఎక్కువగా చర్చించటం అస్సలు వీలుకాదు.