2, మే 2013, గురువారం

తనకొక నొవ్వుపుట్ట


చ. తనకొక నొవ్వుపుట్ట మరి తా గొను మందుగ రామనామమున్
వెనుక ప్రశాంతితో‌ నలరి వేడుక గైకొను రామనామమున్
తనరు సుఖాప్తివేళలను తప్పక గొల్చుచు రామనామమున్
మనసిది రామనామమును మానదు మానదు మానదెన్నడున్

(వ్రాసిన తేదీ: 2013-4-28)


 

2 కామెంట్‌లు:

  1. అనగనగ రాగమతిశయించు చుండు
    తినగ తినగ వేము తియ్యనుండు... అన్నాడు కదండీ వేమన? ఇదిగూడా అంతే. ఎటొచ్చీ అసలు మొదలు పెట్టడానికే ఆయన కరుణ ప్రసరించాలి. ఒక్కసారి వచ్చాడో అప్పుడు..

    ...చుట్టాలు ఆలి విడిచి.. వదలెనెట్టివారినైనా. అని చెప్పాడు కదూ?

    మీ పద్యాలు చదువుతూంటే చాలా సార్లు పోతన భాగవతం గుర్తు వచ్చి కన్నీళ్ళు వస్తూ స్క్రీన్ మీద అక్షరాలు చదవడం కష్టమైపోతోంది. మే బి ఐ యాం టూ ఎమోషనల్.

    రెండు అసందర్భపు ప్రశ్నలు.
    1. పోతన విష్ణువుని వర్ణించడంలో, చాలా చోట్ల 'మకర కుండల కిరీట కేయూర హార .." అనేది వాడారు. కారణం ఏమై ఉండవచ్చు?

    2. మీకు ఈమెయిల్ పంపించడం కుదురుతుందా? ఎడ్రస్ ఇవ్వగలరా?

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. నా పద్యాలతో మీకు పోతనగారి భాగవతం గుర్తుకు రావటమేమిటి? ఆశ్చర్యంగా ఉందండి.
      1. మకర కుండల కిరీట కేయూర హార అంటూ పోతనగారు తరచుగా అనటం నిజమైతే ఆలోచించాలి జవాబుకోసం.
      2. నా మెయిల్ ఐడి: syamala.tadigadapa@gmail.com

      తొలగించండి

ఆమోదించిన వ్యాఖ్యలే ప్రచురితం అవుతాయి. తరచుగా పరిశీలించటం వీలు కాదు కాబట్టి అప్పుడప్పుడు వ్యాఖ్యలు కనిపించటం ఆలస్యం కావచ్చును. తరచుగా జవాబులు ఇవ్వటం నాకు వీలు కాదు. ఎక్కువగా చర్చించటం అస్సలు వీలుకాదు.