10, మే 2013, శుక్రవారం

భగవద్భక్తులు మౌనులై

మ. భగవద్భక్తులు మౌనులై యునికి సర్వార్థంబులం గూర్చు ని
జ్జగమం దారయ వేయి కొక్కరయినం సద్భక్తులే దుర్లభం
బగుటన్ పామరులాడు మాటలకు మారాడంగ భక్తాళికిన్
తగదా దాశరథిం దలంచ తడే దండించు దుర్మార్గులన్

(వ్రాసిన తేదీ: 2013-5-7)  

2 కామెంట్‌లు:

  1. “సారపు ధర్మమున్ విమల సత్యము బాపముచేత బొంకుచేఁ
    భారము బొందలేక చెడఁబాఱినదైన యవస్థ దక్షు లె
    వ్వార లుపేక్ష సేసిరది వారలచే టగుఁగాని ధర్మని
    స్తారక మయ్యు సత్యశుభదాయక మయ్యును దైవముండెడున్.”

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. శ్రీకృష్ణుడు తన రాయబారం సందర్భంగా కురుసభలో చెప్పిన పై మాటలకు నా పద్యానికి context difference ఉన్నదని గమనించగలరు.

      నేను చెప్పిన మౌనం అనేది భగవద్భక్తులు తదితరులు చేసే దకరకాల వాదాలజీలికి పోవటానికి నిరకరించటాన్ని ప్రశంసించటం అన్నమాట.

      శ్రీకృష్ణులవారు సెలవిచ్చినది శిక్షించేందుకు తగిన అధికారం కలిగీ ధర్మాధర్మ విచక్షణ చక్కగా యెరిగిన వారు తమ అధికారాన్ని మమకారాది కారణాలవల్ల ఉపయోగించకుండా చెడును ఉపేక్షించటం అనేదానిని గూర్చీ దాని పరిణామంగా దైవమే యెలా సత్యశుభాలను ప్రతిష్టిస్తాడన్నది హెచ్చరించటం గురించీ.

      తొలగించండి

ఆమోదించిన వ్యాఖ్యలే ప్రచురితం అవుతాయి. తరచుగా పరిశీలించటం వీలు కాదు కాబట్టి అప్పుడప్పుడు వ్యాఖ్యలు కనిపించటం ఆలస్యం కావచ్చును. తరచుగా జవాబులు ఇవ్వటం నాకు వీలు కాదు. ఎక్కువగా చర్చించటం అస్సలు వీలుకాదు.