చ. హృదయము నిచ్చి రామునకు నెల్ల విధంబుల రామదాసులై
సదయుని తోడిదే జగము సర్వము రామమయం బటంచు నె
మ్మది ధరనుండు వారనగ మాధవు సత్కృపచేత మోక్షసం
పదకు విశేషపాత్రులగు వారలు వారికి నేను మ్రొక్కెదన్
(వ్రాసిన తేదీ: 2013-5-7)
సదయుని తోడిదే జగము సర్వము రామమయం బటంచు నె
మ్మది ధరనుండు వారనగ మాధవు సత్కృపచేత మోక్షసం
పదకు విశేషపాత్రులగు వారలు వారికి నేను మ్రొక్కెదన్
(వ్రాసిన తేదీ: 2013-5-7)
ఇదే గుర్తుకొచ్చింది ఈ పద్యం చదవగానే...
రిప్లయితొలగించండిచందురు వర్ణుని అంద చందమును హృదయారవిందమున జూచి
బ్రహ్మానందమను భవించు వారెందరో మహానుభావులూ..
సామ గాన లోలా.. మనసిజ లావణ్య ధన్య మూర్ధన్యులెందరో..
త్యాగరాజు రామ నామం కోటిసార్లు చేసాడుట ఇలాంటి పంచరత్నం నోట్లోంచి రావడానికి. మనకి ఎన్ని జన్మలు పడతాయో మరి ఆ స్థితి చేరుకోవడానికి. తల్చుకుంటే ఏడుపు వస్తోంది ' ఛీ వెధవ బతుకు ' అనిపిస్తూ
ఎన్ని జన్మలైనా పట్టనివ్వండీ. కాని శుభేఛ్ఛ అనే మఒక్షభూమికను మనం అందుకొన్న నాటినుండి యెప్పటికైనా ధన్యులం కాక తప్పదు. భగవానుడే చెప్పాడు కదా, నహి కళ్యాణకృత్ కశ్చిత్ దుర్గతిం తాత గఛ్ఛతి అని. అందు చేత విచారం వదలి పెట్టండి.
తొలగించండి