పాఠకభక్తమహాశయులారా,
ఈ క్రింది పద్యంతో ఒక వంద పద్యాలు సంపన్నం అవుతున్నవి.
నా యీ చిరుప్రయత్నాన్ని చదివి ప్రోత్సహిస్తున్న మీ కందరికీ నా హృదయ పూర్వక ధన్యవాదాలు.
నేను చెప్పుకోదగ్గ తెలుగుపండితుడను కాని కవిని కానీ కాను.
మందః కవి యశః ప్రార్థీ అని యేదో భగవంతునిపై నా చేతనయిన కవిత్వం చెప్పాలని ప్రయత్నిస్తున్న వాడిని మాత్రమే!
నా అజ్ఞానం వలన పద్యాలలో రకరకాల దోషాలు దొర్లుతూ ఉంటాయి.
వాటిని గమనించిన వారు దయచేసి తమ వ్యాఖ్యల ద్వారా నాకు తప్పక తెలియజేయ ప్రార్థన.
తప్పులు దిద్దుకుందుకు నాకు యేవిధమైన బేషజమూ లేదు. తప్పక దిద్దుకుంటాను.
నిజానికి శ్రీరామనవమి వరకూ యెన్నయితే అన్ని పద్యాలు వ్రాసి ముగించాలని భావించాను.
కాని ఆపటం నాకు అశక్యం అయిన విషయంగా తోచినది.
పాఠకులలో కొందరు యీ ప్రయత్నాన్ని అబినందించి కొనసాగించ వలసినదిగా అడగటం కూడా జరిగింది.
అందుచేత యథాశక్తి యీ ప్రయత్నాన్ని కొనసాగించ దలచుకున్నాను.
ఎన్నాళ్ళు వ్రాయగలనో అన్నది అది దైవనిర్ణయం. నాచేతిలో యేమీ లేదు.
ఇలా చేయటం అందరికీ అమోద యోగ్యమే అని భావిస్తున్నాను.
ఇక 100వ పద్యాన్ని తప్పక చదవి ఆనందించండి.
ఉ. సుందరులందు సుందరుడు శుభ్రయశస్కుడు భక్తకోటికిన్
బందుగులందు బందుగుడు ప్రాణసఖుండును రామమూర్తి హృ
న్మందిరమధ్యమందు కరుణన్ వెలుగొందుచు నుండు జానకీ
సుందరిగూడి లక్ష్మణయశోధన వాయుకుమార సేవ్యుడై
(వ్రాసిన తేదీ: 2013-5-7)

హమ్మయ్య,
రిప్లయితొలగించండిశుభమస్తు !
అమ్మవారు మళ్ళీ రాములవారితో వంద లో వచ్చే సేరు ! ఇక అన్నీ శుభకరమే !
మీ రామ నామ పద్య మంజరి మరింత గా కొనసాగాలని ఆశిస్తూ
శుభోదయం
జిలేబి
అభినందనలు. మీరీ ప్రయత్నం కొనసాగించాలని కొరుకుంటున్నా. ఈ రోజు కాకపోయినా మరొకరోజు వీటి అవసరం తప్పక కలుగుతుంది. ఆరోజయినా భక్తితో చదువుతారు. కొనసాగమని వినతి.
రిప్లయితొలగించండికొనసాగిస్తానండీ యథాశక్తిగా.
తొలగించండిమిగతా ఇద్దరు తమ్ముళ్ళూ ఏరీ? పాపం వాళ్ళని వదిలేసారే?
రిప్లయితొలగించండి....
గురువుగారూ మీతో ఇదే పేచీ. రాముడు ఎంతకాలం సాగనిస్తే అంతకాలం రాస్తాను అంటారు. తర్వాత ప్రచురించడం "నా వల్ల" అవుతుందా అంటారు? ఏమిటి మీ ఉద్దేశ్యం? ఆయన రాయిస్తున్నాడు అని చెప్పేరు ముందు. మళ్ళీ "నేను, నా వల్ల" అంటారేమిటి? ఆయన ఇష్టం వచ్చినట్టూ చేయనీయండి. ప్రచురిస్తాడా, చెత్తలో పారేస్తాడా అనేది మీకు అనవసరం. మీ భాధ్యత రాసి ప్రచురించడానికి ప్రయత్నం చేయడమే. ఆ తర్వాత ఆయనే చూసుకోడు అన్నీ?
"నేను చేయగలను" అనుకున్నంతకాలం కరి మకరి సంగ్రామం జరుగుతూనే ఉంటుంది. 'పలికించెడు వాడు రామభద్రుట ' అని పోతనంతటివాడే చెప్పుకున్నాడు కాదూ?
అంచేత నేనిచ్చే 'ఉచిత, బోడి, మీరడగని ' సలహా ఏమిటంటే, "నేను" అనేది మనసులోంచి తీసేసి, ఎన్ని రాయిస్తాడో అన్నీ రాయండి. ఇంకా కాస్త గరుగ్గా చెప్పాలంటే, మీరెవరూ రాయడానికీ, రాయకపోవడానికీ? ఆయనిష్టమైతే మీకు ముక్కుతాళ్ళు వేసి, మూడు చెరువుల నీళ్ళు తాగించి (అసలే ఎండాకాలం!) కర చరణాలు కట్టి, చెంపలు వాయగొట్టి మీచేత రాయిస్తాడు ఆయన. అప్పుడు ఎవరికోసం రాస్తారు? ఒప్పుకుంటారా? :-)
ఒప్పుకోవటం ఒప్పుకోక పోవటం మాత్రం నా చేతులో ఉందా చెప్పండి మరి?
తొలగించండిమీరన్నటుగానే ఆయన యెన్ని వ్రాయిస్తే అన్ని వ్రాయటమే.
ఇవి ప్రచురితం కావాలీ అని ఆయన అనుకుంటే అలాగే అవుతాయి భేషుగ్గా.
మీ సలహాకు నా ధన్యవాదాలు.
అన్నట్లు, పాపం భరతశత్రుఘ్నులు పట్టలేదండీ పద్యంలో!
నా మనసులో మాట మీరు చెప్పేసేరు. నేను చెప్పడానికి సంకోచించా. :) మిత్రులు శ్యామలీయం వారు "అలా ముందుకుపోదాం" :) ఏమంటారు
తొలగించండిఅలాగేనండి.
తొలగించండి