14, మే 2013, మంగళవారం

విద్యల కేమి నేర్వదగు

ఉ. విద్యల కేమి నేర్వదగు విద్య లనేకము లున్న వుర్వి నా
విద్యల కెల్ల పేరుగల విద్య యనం బడు నాత్మవిద్య
ద్విద్యను నేర్వ కష్టమని భీతి నేటికి రామమంత్రమా
విద్యనుగ్రహించు నని విజ్ఞులు చెప్పగ విందు నెప్పుడున్ 


(వ్రాసిన తేదీ: 2013-5-7)

4 కామెంట్‌లు:

  1. ఘటోవా మృత్పిండో... అనే శంకర భగవత్పాదుల శ్లోకం (శివానందలహరి 6) గుర్తుకు తెప్పించారు. ఈ పద్యం చాలా బాగుంది. కొనసాగించండి.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. మీ రుటంకించిన శ్లోకం:
      ఘటోవా మృత్పిండో ప్యణురపిచ ధూమోఽగ్ని రచలః
      పటోవా తంతుర్వా పరిహరతి కిం ఘోరశమనం
      వృధా కంఠక్షోభం వహసి తరసా తర్కవచసా
      పదాంభోజం శంభోర్బజ పరమసౌఖ్యం వ్రజ సుధీః

      ఈ‌ 'పాహి రామప్రభో' పద్యశ్రేణిపై మీ అభిమానానికి ధన్యవాదాలు

      తొలగించండి

ఆమోదించిన వ్యాఖ్యలే ప్రచురితం అవుతాయి. తరచుగా పరిశీలించటం వీలు కాదు కాబట్టి అప్పుడప్పుడు వ్యాఖ్యలు కనిపించటం ఆలస్యం కావచ్చును. తరచుగా జవాబులు ఇవ్వటం నాకు వీలు కాదు. ఎక్కువగా చర్చించటం అస్సలు వీలుకాదు.