2, మే 2012, బుధవారం

వేడుకైన షష్టిపూర్తి వేళ నున్న బొమ్మ

అందరి మధ్యన నిలచి యాడెడు బొమ్మ
అందరితో కొసరి మాటలాడెడు బొమ్మ
అందముగ నీచేతుల నమరించిన బొమ్మ
అందందు త్రిప్పుచు నీ వాడించు బొమ్మ

అరువదేళ్ళుగా నిచట నాడుచున్న బొమ్మ
సరసమైన కదలికల చక్కనైన బొమ్మ

వేడుకైన షష్టిపూర్తి వేళ నున్న బొమ్మ
ఏడుగడ వీవాడించు నాటలాడు బొమ్మ

నీదు వ్రేలి కొసల చూపు నిలుపుకున్న బొమ్మ
కాదనక నీ యానతి కదలుచుండు బొమ్మ

11 కామెంట్‌లు:

 1. బ్రహ్మ చేసిన పిచ్చి మానవుడు

  రిప్లయితొలగించండి
 2. మిత్రులు శ్రీ తాడిగడప శ్యామల రావు గారికి
  షష్టి పూర్తి సందర్భముగా
  హార్దిక శుభాకాంక్షలు
  ఇట్లు
  నేమాని రామజోగి సన్యాసి రావు

  రిప్లయితొలగించండి
 3. ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.

  రిప్లయితొలగించండి
 4. ఆలస్యంగా మీ బ్లాగు చూసాను - ఈ మధ్య అస్సలు కుదరడం లెదు, పని ఒత్తిడి వల్ల! మీకు షష్ఠి పూర్తి శుభాకాంక్షలు!
  బాబాయి గారూ! ఇలానే మీరు సహస్ర చంద్ర దర్శన వేడుకలు కూడా జరుపుకోవాలని మనసారా కోరుకుంటూ - మీ అమ్మాయి .. శిరీష.

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. అమ్మాయి,
   చాలా సంతోషం. శ్రీనేమానివారుకూడా నీ లాగే నేను హస్ర చంద్ర దర్శనం చేయాలని ఆశీర్వదించారు. అందరి శుభకామనలతో అలాగే భాషాసేవ చేయాలని ఆశిస్తున్నాను.

   తొలగించండి
 5. శ్యామల రావు గారు ! బహు చక్కని ప్రాయము షష్ఠిపూర్తి , బా
  ధామయ జీవితంపు సెగ దాటి ప్రశాంతత చేరియుండుటన్
  ఈ మలి సంధ్యయే బ్రతుకు కెంతయు గొప్పది , పూర్తిగా పరం
  ధాముని చింతనన్ మునుగు దారి లభించెడు నెల్ల వేళలన్ .

  బ్లాగు సుజన-సృజన

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. రాజారావుగారూ, పూర్తిగా పరంధాముని చింతనలో మునిగే భాగ్యం కలిగాలనే నా ఆశ. ధన్యవాదాలు.

   తొలగించండి
 6. షష్టిపూర్తి శుభాకాంక్షలు శ్యామలరావు గారు

  రిప్లయితొలగించండి
 7. మీకు షష్టిపూర్తి శుభాకాంక్షలు
  శ్యామలరావు గారూ!
  @శ్రీ

  రిప్లయితొలగించండి
 8. Babayya garu, mee blog ni chaaaala late ga choosanu. Mee bommaku oka chinna alamkaram.

  Chakkani telugunu bahu chikkaga chilikinchuchuyunna bomma!

  రిప్లయితొలగించండి

కం. పలుకుడు పలికెడు నెడలను
పలుకుల విలువలకు మురిసి పలికెడు కళలో
నిల గడుగడు నిపుణులు తగ
పలికెడు తెఱగిటుల ననుచు పలుకగ విబుధుల్

(తెలుగులో వ్రాయటానికి అవసరమైతే లేఖిని సహాయం తీసుకోండి. Windows వాడేవారు ప్రముఖ్ IME డౌన్ లోడ్ చేసుకోవచ్చును )

గమనిక: అమోదించబడిన వ్యాఖ్యలు మాత్రమే ప్రచురించబడతాయి. తమ పరిచయం పొందుపరచకపోతే అజ్ఞాతల వ్యాఖ్యలు వెంటనే బుట్టదాఖలు అవుతాయి.