గోపాల గోవింద మాంపాలయ పరి
తాపోపశమనైకదక్షకృపామేఘ
కేశవ మాధవ కిల్బిషమోచన
నాశనరహిత యనాథశరణ్య
దశరథసుత భవతారణనౌకా
శ్రీశ సురాధిపసేవ్యపదాంబుజ
కామితదాయక కరుణాధామా
శ్రీమద్దశరథప్రియధన రామా
పామరపండితభావితనామా
క్షేమంకర హరి శ్రితజనవత్సల
కరధృతభూధర ఘనసుగుణాకర
గురుమఖరక్షక సురరిపుశిక్షక
సురగణతోషక సుజనసుపోషక
హరి నిర్వాణమహాఫలదాయక