రామ రామ రామ యనుటే మేలు
రామ రామ యన వినుటే మేలు
రామ రామ యన వినుటే మేలు
రామనామమును నమ్ముటె మేలు
రామనామమును తలచుటె మేలు
రామనామమను పలుకుటె మేలు
రామనామమును వ్రాయుటె మేలు
రామభక్తులను తలచుటె మేలు
రామభక్తులను కలియుటె మేలు
రామభక్తులకు మ్రొక్కుటె మేలు
రామభక్తులను చేరుటె మేలు
రాముని కీర్తన వినుటయె మేలు
రాముని కీర్తన చదువుటె మేలు
రాముని కీర్తన చేయుటె మేలు
రాముని కీర్తన పంచుటె మేలు
రామభజన కుత్సహించుటె మేలు
రామభజనలకు పోవుటె మేలు
రామభజనలో కలయుటె మేలు
రామభజనలో పండుటె మేలు
రాముని సన్నిధి తలచుటె మేలు
రాముని సన్నిధి కోరుటె మేలు
రాముని సన్నిధి చేరుటె మేలు
రాముని సన్నిధి వదలమి మేలు
రాముని మనసున తలచుటె మేలు
రాముడు మనసున నిండుటె మేలు
రాముని కొఱకై బ్రతుకుటె మేలు
రామునిలో లీనమగుటే మేలు