రామనామమహిమ నుడువ బ్రహ్మకైనను వశము కాదు
రామనామము వలన మనకు రానిసంపద యనగ లేదు
వేడకున్నను రామనామము కూడు గుడ్డల నిచ్చి కాచును
వేడకున్నను రామనామము విపులమైన సిరులొసంగును
వేడకున్నను రామనామము విమలమైన విద్య లొసగును
వేడకున్నను రామనామము వాడవాడల కీర్తి నొసగును
వేడకున్నను రామనామము నేడు రేపును తలను కాచును
వేడకున్నను రామనామము పాడు కలిని పారద్రోలును
వేడకున్నను రామనామము ప్రీతితో భక్తులను కాచును
వేడకున్నను రామనామము వేడదగిన వెల్ల నిచ్చును
వేడకున్నను రామనామము పేరుకొన్న మోహమణచును
వేడకున్నను రామనామము వివిధతాపంబుల నణంచును
వేడకున్నను రామనామము విమలశాంతము మన కొసంగును
వేడకున్నను రామనామము జాడ జూపును మోక్షపురికి