16, జనవరి 2019, బుధవారం

జలజాప్త కులసంభవ రామచంద్ర నళినాక్ష నారాయణ



జలజాప్త కులసంభవ రామచంద్ర
నళినాక్ష నారాయణ

అజ్ఞానతిమిరనాశ విజ్ఞానసుప్రకాశ
ప్రజ్ఞానఘనరూప రమణీయనరవేష
అజ్ఞుడను నన్ను నీ వాదరించి దయతోడ
నాజ్ఞచేసితివి నా కంతియ చాలు

సురగణార్తిశోషణ వరమునీంద్రతోషణ
పరమభక్తపోషణ కరుణాబరితేక్షణ
వరదాయక నీవు నాభావనలో నిలచితివి
పలమాత్మ నాకదే పదివేలయ్య

సర్వేశ్వర సర్వాత్మక సర్వలోకప్రకాశక
సర్వార్తిశమనౌషధ సర్వపాపవదారక
సర్వవిధంబులుగ నిను చక్కగా నమ్మితిని
సర్వస్వము నాకు నీ చరణంబులే