తానేమో నేనేమో మానేమో యీ ఆటలు నేను తనను వెదకుదునా తాను దాగి నవ్వేనా |
|
ఎందున్నా వని యందును ఎందు లేనని నవ్వును ఎందుకు దాగెద వందును సందియము వలదనును |
॥తానేమో॥ |
నేను తన తోటలో తాను నాతో ఆటలో నే నెఱిగినది లేదు తా నెఱుగనిది లేదు |
॥తానేమో॥ |
వెదకి వెదకి కనుగొంటిని తుదకు తాను నాలోనే మెదటి నుండి యున్నాడని వెదుకులాట వెఱ్ఱియని |
॥తానేమో॥ |
17, ఏప్రిల్ 2015, శుక్రవారం
తానేమో నేనేమో
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
పోస్ట్లు (Atom)