తపము తపమంటా రదేమయ్యా మరి యా తపము వలన ఫలిత మేమయ్యా |
|||
తపము తపమన ధర్మపరుడై దాశరథినే నమ్మియుండుట తపసి వెన్నుగాచి యుండుట దాని ఫలితము తెలిసికొనుము |
తపము |
||
తపము తపమన యెల్లవేళల దాశరథినే తాను కొలుచుట అపజయమ్ము లేక కోరిక లన్ని తీరుట దాని ఫలము |
తపము |
||
తపము తపమన రామధ్యానము దాని ఫలితము బ్రహ్మఙ్ఞానము తపము చేసి ఙ్ఞానియై పరతత్త్వమందే తాను కలియును |
తపము |
||
13, ఏప్రిల్ 2015, సోమవారం
తపము తపమంటా రదేమయ్యా
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
పోస్ట్లు (Atom)