చదివేరు చదువులు చదివిన చదువుల పదిలమౌ సారంబు బట్టలేరు పలికేరు పలుకులు పలికెడి పలుకులు చిలుకు విషాగ్నులు తెలియలేరు నడిచేరు నడతలు నడిచెడు నడతల పొడమెడు చెడుగులు పోల్చలేరు బ్రతికేరు బ్రతుకులు బ్రతికెడు బ్రతుకుల కలిగెడు పతనంబు కాంచలేరు ఇలకు చనుదెంచి నరులార యెంతసేపు నేను నేనను భ్రాంతిలో మేను మరచి పొరలు చున్నారు నూఱేళ్ళు బుధ్ధి మరలి మేలుకొను డయ్య యిటు లుంట మేలు గాదు |
||
20, అక్టోబర్ 2014, సోమవారం
మేలుకొను డయ్య యిటు లుంట మేలు గాదు
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
పోస్ట్లు (Atom)