నినుగూర్చి నిజముగా నీ కేమి తెలియునో ఈశ్వరు డొక్కడే యెఱుగు గాని ఎన్నిజన్మము లెత్తి యున్నావొ యెఱుగుదే ఈశ్వరు డొక్కడే యెఱుగు గాని సత్యమసత్యంబు చక్కగా నెఱుగుదే ఈశ్వరు డొక్కడే యెఱుగు గాని ఎన్నడు మోక్షమో యేమైన నెఱుగుదే ఈశ్వరు డొక్కడే యెఱుగు గాని ఇట్లు నీ వేమి యెఱుగక యెంత తడవు భూమి నటునిటి గ్రుమ్మఱి యేమి ఫలము నేను నేనను యహమిక మాని హరిని చింతనము జేసి సద్గతి జెందరాదె |
||
19, అక్టోబర్ 2014, ఆదివారం
నినుగూర్చి నిజముగా నీ కేమి తెలియునో
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
పోస్ట్లు (Atom)