కనులు మూతబడు క్షణమున నిన్నే తనివారగ కనుగొనగలనా రామా |
|
నిరతము లాలస నిండిన చూపుల పరువులెత్తి నశ్వరముల వెనుక అరరే కన్నులు తెరచితి నిపుడే తరలిపోయెడు తరుణమాయెనే |
॥కనులు॥ |
వెలుగులలో తొలి వెలుగువు నీవని తెలియక యెంతో మోసపోయితిని తెలిసితి నిపుడే తెరచితి కన్నులు మలగిపోవు క్షణమరుదెంచెనయా |
॥కనులు॥ |
ప్రాణప్రదుడా భవబంధముల పోనడచెడు నీ పుణ్యరూపమును కానగ నగు భాగ్యమున కన్నను ఈ నా కన్నుల కేమి వలయును |
॥కనులు॥ |
9, జనవరి 2014, గురువారం
కనులు మూతబడు క్షణమున
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
పోస్ట్లు (Atom)