ఏమిలాభ మిక ఏమిలాభ మిక ఇందే తిరుగచు నుండేరు
రామా రామా యన్నారా శ్రీరాముని రక్షణ పొందేరు
ధారాళమగు సుఖములకొఱకై తహతహలాడుచు తిరిగేరో
కోరి కామినీకాంచనములను కువలయమంతయు తిరిగేరో
కోరక మోక్షము మదిలో నెప్పుడు కొరమాలినవే కోరేరో
నోరుచేసుకని పదుగురినెపుడు దూరుచు కాలము గడిపేరో
చేరి నిరీశ్వరవాదులతోట దుశ్శీలురతో చెడిపోయేరో
దారుణపాషండమతంబులలో దూరిభ్రష్టులైపౌయేరో
గారడివిద్యల గురువుల నమ్మి అగాధములో పడిపోయేరో
నారదాదిమును లెప్పుడు పొగడే నారాయణునే మరచేరోతారకమంత్రము జోలిక పోవక తక్కిన వేవో తలచేరో
శ్రీరఘురాముని పొగడగ నేరక చేరి యితరులను పొగడేరో
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి
ఆమోదించిన వ్యాఖ్యలే ప్రచురితం అవుతాయి. తరచుగా పరిశీలించటం వీలు కాదు కాబట్టి అప్పుడప్పుడు వ్యాఖ్యలు కనిపించటం ఆలస్యం కావచ్చును. తరచుగా జవాబులు ఇవ్వటం నాకు వీలు కాదు. ఎక్కువగా చర్చించటం అస్సలు వీలుకాదు.