శ్రీరాముని పుట్టినరోజున చేస్తున్నారండి
తెలుగునాట ఊరూవాడా తిలకించ వేడుక లండి
కళకళ లాడే సీతారామ కళ్యాణవేదిక లండి
తెలుగు వచ్చిన ప్రతివాడు తెలియగ పెళ్ళిపెద్దండి
చిలుకలకొలికి సీతమ్మ మన తెలుగింటి బిడ్డండి
సందుసందున జనకరాజలు చక్కగ కనిపించేరండి
సందుసందున దశరథు లరిగొ చక్కగ కనిపించేరండి
సందుసందున వేదికపైన అందగాడు శ్రీరామచంద్రుని
సుందరి సీత పెండ్లియాడెడు సుందరదృశ్యము కనరండి
ఏటేటా మన తెలుగు నేలపై యిటులే సీతారాములకు
కోటికోటి కళ్యాణ వేదికల గొప్పగ పెళ్ళివేడుకలు
సాటిలేని అభిమానసంపదను చక్కగచాటి చెప్పగను
నీటుగాడు శ్రీరాము డందరిని నిత్యము చల్లగ చూడగను
మీ గీతిలో "అందగాడు శ్రీరామచంద్రుని
రిప్లయితొలగించండిసుందరి సీత పెండ్లియాడెడు సుందరదృశ్యము"ను బహుచక్కగా తిలకించామండి - ఆనందించామండి!