22, ఫిబ్రవరి 2022, మంగళవారం

శ్రీరామ శ్రీరామ శ్రీరామా భవతారకనామా శ్రీరామా

శ్రీరామ శ్రీరామ శ్రీరామా భవతారకనామా శ్రీరామా

నారాయణ హరి శ్రీరామా జగన్నాథ పరాత్ప‌ర శ్రీరామా


నారదాదిమునినాయకసన్నుత శ్రీరఘునాయక శ్రీరామా

దారుణదైత్యకులాంతకవిక్రమ దశరథనందన శ్రీరామా

మారజనక సుకుమారవపుష హరి మానవనాయక శ్రీరామా

ధారాధరఘనశ్యామవపుష వరదాయక శుభదా శ్రీరామా


మునిగణయాగవివర్ధనకారణ మోహవిదారణ శ్రీరామా

జనకసుతాహృదయాలయవిహరణ సద్గుణధామా శ్రీరామా

దినకరకోటిసమానప్రకాశా దేవదేవ హరి శ్రీరామా

వనరుహలోచన వనమాలాధర వననిధిబంధన శ్రీరామా


ఘనపాపాంతక ఘనతాపాంతక ఘనశాపాంతక శ్రీరామా

వనజాసననుత వాసవసన్నుత త్రినయనసన్నుత శ్రీరామా

దినపతికులపతి దైవతకులపతి జనపతికులపతి శ్రీరామా

నను కరుణించుము నాస్వామీ కరుణాక‌ర శ్రీకర శ్రీరామా


3 కామెంట్‌లు:

  1. మహాద్భుతంగా వ్రాసారు శ్యామలీయం గారూ. లయబద్ధంగా పాడుకోవడానికి చాలా చాలా అనువుగా ఉంది. నేనంత గాయకుణ్ణేమీ కాదు గానీ నేను పాడుకున్న రాగంలో మొదటి రెండు లైన్లు ఈ విధంగా మార్చుకుని మొత్తం గీతం పాడుకుంటే ట్యూన్ కు బాగా అమిరింది.

    "శ్రీరామా జయ(రఘు)రామా భవ తారక నామా శ్రీరామా
    నారాయణ హరి శ్రీరామా హే(ఓ) జగత్ పరాత్ప‌ర శ్రీరామా"

    నా ఉద్దేశ్యం మిమ్మల్ని మార్చమని కాదు. లయకు ఇలా బాగా కుదిరింది అని చెప్పడమే నా సదుద్దేశ్యం. ఇంత చక్కటి గీత రూప కల్పనకు మీకు హృదయపూర్వక అభినందనలు 🙏

    రిప్లయితొలగించండి

ఆమోదించిన వ్యాఖ్యలే ప్రచురితం అవుతాయి. తరచుగా పరిశీలించటం వీలు కాదు కాబట్టి అప్పుడప్పుడు వ్యాఖ్యలు కనిపించటం ఆలస్యం కావచ్చును. తరచుగా జవాబులు ఇవ్వటం నాకు వీలు కాదు. ఎక్కువగా చర్చించటం అస్సలు వీలుకాదు.