ఎప్పుడో పదహారేళ్ళ క్రిందట ఏదో ప్రవవనంలో గరికపాటి వారు అన్న కొన్ని మాటలు విశ్వబ్రాహ్మణుల మనోభావాలను గాయపరచాయట.
ఎవరినో కించపరచే ఉద్దేశంతో గరికపాటివారు మాట్లాడే అవకాశం లేదు.
కానీ పదహారేళ్ళ తరువాత ఇప్పుడు మనోభావాలు గాయపడటం ఏమిటీ?
ఇన్ని సంవత్సరలలోనూ ఏవిశ్వబ్రాహ్మణులూ ఈమాటలు విననే లేదా? ఇన్నాళ్ళూ గాయపడని మనోభావాలు ఇప్పుడు గాయపడటం ఏమిటో. ఒక మాయలాగా ఉంది.
గరికపాటి వారికి పద్మశ్రీ పురస్కారం వచ్చి నెల అయిందో లేదో. ఇంతలో ఈవిధంగా మనస్తాపం కలిగింది.
ఇది ఎవరో కావాలని లేవనెత్తిన వివాదంలా అనిపిస్తోంది.
ఈ వివాదం సందర్భంగా చివరకు గరికపాటి వారు విశ్వబ్రాహ్మణుల మన్నన కోరవలసి వచ్చింది. ఈ క్రింది వీడియోను తిలకించండి. (ఈ వీడియోను మీరు యూట్యూబులో చూడవలసి ఉంటుంది. వేరే సైట్లలో అది నేరుగా నడవదు!) ఆయన నిజంగా ఎంత క్షోభపడ్డారో తెలుస్తున్నంది. పదిమంది హితమూ కోరి ప్రవచనం చేసే సరస్వతీమూర్తికి ఇలాంటి అవమానం జరగటం దుస్సహం.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి
కం. పలుకుడు పలికెడు నెడలను
పలుకుల విలువలకు మురిసి పలికెడు కళలో
నిల గడుగడు నిపుణులు తగ
పలికెడు తెఱగిటుల ననుచు పలుకగ విబుధుల్
(తెలుగులో వ్రాయటానికి అవసరమైతే లేఖిని సహాయం తీసుకోండి. Windows వాడేవారు ప్రముఖ్ IME డౌన్ లోడ్ చేసుకోవచ్చును )
గమనిక: అమోదించబడిన వ్యాఖ్యలు మాత్రమే ప్రచురించబడతాయి. తమ పరిచయం పొందుపరచకపోతే అజ్ఞాతల వ్యాఖ్యలు వెంటనే బుట్టదాఖలు అవుతాయి.