9, జూన్ 2020, మంగళవారం

బుధజనానందకర పూర్ణచంద్రానన


బుధజనానందకర పూర్ణచంద్రానన

విధిశంకరశక్రవినుత వీరరాఘవనిరుపమానగుణసాగర నిర్మలానందకర

నిరుపమానపరాక్రమ నిర్జితాసురలోక

నిరుపమానదయానిధి నిజభక్తమందార

నిరుపమానశుభచరిత నీలమేఘశ్యామసకలదివిజగణతోషణ వికటదనుజశోషణ

సకలమౌనిగణతోషణ సదాశుభదభాషణ

సకలభక్తజనతోషణ సకలదుఃఖశోషణ

సకలజగసంపోషణ సర్వమంగళేక్షణసురముఖ్యసంపూజిత  వరవిక్రమమూర్తి

పరమయోగిసంభావితపరబ్రహ్మస్వరూప

పరమభక్తసమర్చిత పరమపావనాకృతి

ధరణిజాసంసేవిత సురుచిరపదకమల


కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

కం. పలుకుడు పలికెడు నెడలను
పలుకుల విలువలకు మురిసి పలికెడు కళలో
నిల గడుగడు నిపుణులు తగ
పలికెడు తెఱగిటుల ననుచు పలుకగ విబుధుల్

(తెలుగులో వ్రాయటానికి అవసరమైతే లేఖిని సహాయం తీసుకోండి. Windows వాడేవారు ప్రముఖ్ IME డౌన్ లోడ్ చేసుకోవచ్చును )

గమనిక: అమోదించబడిన వ్యాఖ్యలు మాత్రమే ప్రచురించబడతాయి. తమ పరిచయం పొందుపరచకపోతే అజ్ఞాతల వ్యాఖ్యలు వెంటనే బుట్టదాఖలు అవుతాయి.