10, జూన్ 2020, బుధవారం

గోవిందా రామ గోవిందా హరి


గోవిందా రామ గోవిందా హరి

గోవిందా కృష్ణ గోవిందా


పాకారి సన్నుత శ్రీరామ హరి భండనపండిత గోవిందా

లోకపోషక హరి గోవిందా జయ లోకైకనాయక గోవిందా

కాకుత్స్ఠవంశజ గోవిందా దశకంఠవిమర్దన గోవిందా

గోకుల నందన గోవిందా హరి గోపాలకృష్ణా గోవిందాశ్రీరఘునందన గోవిందా హరి చింతితార్ధప్రద గోవిందా

తారకనామా గోవిందా హరి దశరథనందన గోవిందా

శ్రీరామచంద్ర గోవిందా హరి సీతామనోహర గోవిందా

నారాయణ హరి గోవిందా రామ కారుణ్యాలయ గోవిందాశ్రీరమణీప్రియ గోవిందా హరి చిన్మయరూప గోవిందా

ఘోరదైత్యహర గోవిందా కృష్ణ కురుకులధ్వంసన గోవిందా

శ్రీరుక్మిణీశ గోవిందా హరి శ్రితపారిజాత గోవిందా

నారాయణ హరి గోవిందా కృష్ణ నారకమోచన గోవిందా