21, జూన్ 2020, ఆదివారం

రామ నామమే‌ నాకు రమ్యమైన మంత్రము


రామ నామమే‌ నాకు రమ్యమైన మంత్రము
మీమీ బుధ్ధుల కది మేలగునో కాదో


కొందరకు ఋణవిముక్తి గూర్చునదే‌ మంత్రము
కొందరకు ధనములను కురియునదే‌ మంత్రము
కొందరకు స్వర్గము చేకూర్చునదే మంత్రము
అందర కన్నిటిని గూర్చు నందమైన మంత్రము


కొందర కారోగ్యము కూర్చునదే‌ మంత్రము
కొందరకు కార్యసిధ్ధి గూర్చునదే మంత్రము
కొందరకు కోరినది కొలుచునదే‌ మంత్రము
అందర కన్నిటిని గూర్చు నందమైన మంత్రము 


కొందరకు విద్యలు చేకూర్చునదే‌ మంత్రము
కొంరరకు పదవులు చేకూర్చునదే మంత్రము
కొందరకు స్త్రీవశ్యము కూర్చునదే‌ మంత్రము
అందర కన్నిటిని గూర్చు నందమైన మంత్రము

 
కొందరకు యశమును చేకూర్చునదే మంత్రము 
కొందర కపమృత్యువును కొట్టునదే మంత్రము
కొందరకు బంధములను కోయునదే మంత్రము
అందర కన్నిటిని గూర్చు నందమైన మంత్రము