25, ఫిబ్రవరి 2014, మంగళవారం

నూతన రాష్ట్రం అవసరాలూ - కుల ప్రయోజనాలూఈ‌ విషయం గురించి మొన్న 23వ తారీఖున ప్రత్యెక ఆంధ్ర రాష్ట్రంలో కమ్మవారికి కలిగే ప్రయోజనాలేమిటి? అనే టపాకు వ్యాఖ్యలుగా కొన్ని విషయాలు వ్రాసాను.

అలోచించగా ఈ వ్యాఖ్యలు రెండింటినీ యీ శ్యామలీయం బ్లాగులో ఒక టపా గా ఉంచితే విస్తృతప్రజానీకానికి అంది మరింత ఉపయుక్తంగా ఉంటాయన్న భావన కలిగింది.

ఈ భావనకు బలం చేకూర్చుతూ కొన్ని వార్తలు వస్తున్నాయి.  ముఖ్యంగా కాపు సామాజిక వర్గంపై కాంగ్రెస్ కన్ను వేసి భారతజాతీయ కాంగ్రెసు అనే ఘనత వహించిన లౌకికపార్టీ ఆలోచిస్తోందనీ, శ్రీచిరంజీవిగారిని ముఖ్యమంత్రిని చేయటం జరుగచచ్చనీ వార్తల సారాంశం.  ఈ క్రమంలోనే కాపు సామాజిక వర్గాన్ని బీసీల్లో చేర్చేలా ఆర్డినెన్స్ ప్రవేశపెట్టే ఆలోచనలో కూడా కాంగ్రెస్ అధిష్టానం ఉన్నట్లు తెలుస్తుంది. పనిలో పనిగా ముస్లింలకు కూడా ఐదు శాతం రిజర్వేషన్లు ఏర్పాటు చేయాలని చూస్తోంది అనీ ఆ టపాలో పేర్కొనటం జరిగింది. ఇలా మతాలు కులాల ప్రాతిపదికన, -- అన్నట్లు ప్రాంతాల సెంటిమెంట్ల ప్రాతిపదికన కూడా -- జనబాహుళ్యాన్ని ముక్కముక్కలుగా విభజించే ఈ‌ నూటపాతికేళ్ళ చరిత్ర గలిగిన పార్టీగా చెప్పుకొనే యీ భారతజాతీయకాంగ్రెసు పార్టీ మనదేశంలో అతిముఖ్యమైన లౌకికవాద పార్టీగా ప్రజలను గత అరవైఐదేళ్ళుగా తీవ్రాతితీవ్రంగా వంచిస్తూనే ఉంది.

జనం కేవలం వెఱ్ఱిగొఱ్ఱెలు అనే దివ్యమైన కాలనిరూపితమైనదిగా రాజకీయవర్గాలలో భావించబదుతున్న సిధ్దాంతం మేరకు మన ప్రజలు కులాలప్రాతిపదికనా, మతాల ప్రాతిపదికనా, ప్రాంతాలప్రాతిపదికనా ఇంకా దేశక్షేమం తప్ప అనేకానేక నిర్హేతుకమైన సవాలక్షప్రాత్రిపదకలతో ఓట్లపండగ చేసేసుకుంటే అచిరకాలంలోనే భారతదేశం కూడా ముక్కలు చెక్కలు అయ్యే ప్రమాదం‌ పొంచిఉంది.

ఈ రోజునే పులిపై స్వారీ ప్రమాదకరం!  అనే ఒక సరసభారతివారి టపా ఒకటి చదివాను.  అందులోని మాటలు కొన్ని చూడండి: భారతీయులంతా ఒకటే అనే భావాత్మక సమైక్యత లేకపోతే భారతదేశం 1990లో రష్యా విడివడినట్లు చిన్న చిన్న దేశాలుగా విడిపోతుంది. ఇది ఊహాగానం కాదు. చైనావారు స్పష్టంగా తమ వెబ్‌సైట్‌లో ఈమధ్య ఈ అంశాన్ని ప్రచురించారు. "భారత్ 50 చిన్న దేశాలుగా మారుతుంది" అని తేల్చి చెప్పారు.
ఈ క్రమంలోనే కాపు సామాజిక వర్గాన్ని బీసీల్లో చేర్చేలా ఆర్డినెన్స్ ప్రవేశపెట్టే ఆలోచనలో కూడా కాంగ్రెస్ అధిష్టానం ఉన్నట్లు తెలుస్తుంది. పనిలో పనిగా ముస్లింలకు కూడా ఐదు శాతం రిజర్వేషన్లు ఏర్పాటు చేయాలని చూస్తుంది. - See more at: http://aviiviannee.blogspot.in/2014/02/blog-post_25.html#sthash.gM3DMXF6.dpuf
ఈ క్రమంలోనే కాపు సామాజిక వర్గాన్ని బీసీల్లో చేర్చేలా ఆర్డినెన్స్ ప్రవేశపెట్టే ఆలోచనలో కూడా కాంగ్రెస్ అధిష్టానం ఉన్నట్లు తెలుస్తుంది. పనిలో పనిగా ముస్లింలకు కూడా ఐదు శాతం రిజర్వేషన్లు ఏర్పాటు చేయాలని చూస్తుంది. - See more at: http://aviiviannee.blogspot.in/2014/02/blog-post_25.html#sthash.gM3DMXF6.dpuf
ఈ క్రమంలోనే కాపు సామాజిక వర్గాన్ని బీసీల్లో చేర్చేలా ఆర్డినెన్స్ ప్రవేశపెట్టే ఆలోచనలో కూడా కాంగ్రెస్ అధిష్టానం ఉన్నట్లు తెలుస్తుంది. పనిలో పనిగా ముస్లింలకు కూడా ఐదు శాతం రిజర్వేషన్లు ఏర్పాటు చేయాలని చూస్తుంది. - See more at: http://aviiviannee.blogspot.in/2014/02/blog-post_25.html#sthash.gM3DMXF6.dpuf

సరే విషయానికి వద్దాం. ప్రత్యెక ఆంధ్ర రాష్ట్రంలో కమ్మవారికి కలిగే ప్రయోజనాలేమిటి? అనే టపాకు నా మొదటివ్యాఖ్య ఇలా ఉంది:

ఆర్యా,

మీ ఈ వ్యాసంలో విషయాల గురించి నేను వ్యాఖ్యానించటం లేదు.  అంతకంటే ముఖ్యమైన ఒకటి రెండు విసయాలు ప్రస్తావిస్తున్నాను. గమనించండి.

౧. కులం‌ ప్రాతిపదికగా అలోచించటం వలన,  వైషమ్యాలు పెరగటం మినహాయించి ప్రజాబాహుళ్యానికి నేడైనా రేపైనా కలిగే ప్రయోజనం శూన్యం. సంకుచితమైన ఇటువంటీ ఆలోచనాధోరణులకు స్వస్తిచెప్పి,  రాష్ట్రప్రజల సమిష్టిప్రయోజనాల కొరకు చేతనైన కృషి చేయటానికి అందరూ పూనుకోవలసిన అత్యవసర పరిస్థితిని దయచేసి అర్థం చేసుకోవలసింది.

౨. మన ప్రియతమ భారతదేశంలో ప్రజలు అనేకానేక కారణాలవలన తమలో తాము చిలిపితగాదాలలో నిమగ్నులైపోయి నిత్యం తమతమ శక్తియుక్తులన్నీ సాటిభారతీయుల ప్రయోజనాలు కూలద్రోయటం అనే ఏకైకకార్యక్రమంలో నిమగ్నులైపోవటం కారణంగా మనదేశం దుర్భరదాస్యశృంఖలాలలో చిక్కి వేయేండ్లపైచిలుకు కునారిల్లింది.  ఇప్పుడు మనం చెప్పుకుంటున్న స్వతంత్రం‌ కూడా సంపూర్ణమైనది కాదు.  మనలో మనం‌ ఏనాడు ఐకమత్యంతో ఉండి భారతదేశాభివృధ్ధి తప్ప సంకుచితమైన ఇతరలక్ష్యాల వైపు చూడటం వాటికోసం ఆలోచించటం మాని వేసి దేశాన్ని సుభిక్షం చేసుకుంటామో అప్పుడే మనదేశం నిజమైన స్వతంత్రసంసిధ్ధి పొందినది అవుతుంది.  ఈ విషయంలో మీరు ఏకీభవిస్తారని ఆశిస్తున్నాను.

౩. దేశంలో అసంఖ్యాకంగా కులాలున్నాయి. కులవ్యవస్థలేదు లేదు అనుకునే ఇతరమతాలలో సైతం అనేక ఏవేవో నామరూపాలతో కులాలున్నాయి.  బహుశః ఈ దేశంలో మతం మారినవారు తమ కులాన్ని కూడా వెంట బెట్టుకొని వెళ్ళి మరీ ఆయాకులాల్లో వాటిని కొనసాగించారు.  దేశవ్యాప్తంగా ఉన్న వందలాది కులాలు తమతమ వర్గీయుల అభివృధ్ధి అనే హ్రస్వదృష్టిని వదుల్చుకుని భారతీయులంతా ఒకటే అనే దృక్కోణం అలవరచుకోవాలి.  ఇది చెప్పినంత సులభం కాదని తెలుసును.  ఐనా విద్యాగంధం కాస్తకాస్త వ్యాపిస్తున్న ఈ రోజుల్లో సద్భావనలూ వ్యాప్తిచెందాలి కదా!  విద్యావంతులు సాహసించి సంకుచిత కులదృక్పధనిర్మూలనకు కృషిచేస్తే గాని మెల్లమెల్లగా దేశంలో ఐకమత్యం పరిడవిల్లే రోజు రాదు.  దయచేసి ఆలోచించండి.  బ్రాహ్మణసేవాసంఘాలూ, కమ్మఅసోసియేషనులు, క్రిష్టియన్ యూనిటీ అంటూ మనలో మనమే చిన్నచిన్న వృత్తాల్లో మనని మనం ఇముడ్చుకుంటూ నూతుల్లో కప్పల్లా జీవించటమే మోక్షం అనుకుంటే ఈ దేశం‌ మరలా క్రమంగా విదేశాల ప్రత్యక్షపాలనలోకి పోతుంది.  నిర్మొగమాటంగా చెప్పాలంటే ఇప్పటికే మనం ప్రత్యక్షవిదేశీపాలనలోకి వచ్చి దానికి జైకొడుతున్నాం.

మీకు చేతనైన కృషి చేయండి. అర్హులకు సాయం చేయండి.  వాళ్ళు మనకులమా అని ఆలోచించకండి.  మంచి పనులు చేయండి.  మనం చేసే మంచి మన కులం వాళ్ళకోసమే పరిమితం కావాలని ఆలోచించకండి.

ఇంతకంటే చెప్పగలిగినది లేదు.  నమస్కారం.

మీకు ఇలా హితబోధలు చేయటానికి నేనెవణ్ణి అన్న భావన కలిగితె దయచేసి క్షమించండి. 

లోకాస్సమస్తా స్సుఖినో భవంతు.  స్వస్తిరస్తు.


ఇక  ప్రత్యెక ఆంధ్ర రాష్ట్రంలో కమ్మవారికి కలిగే ప్రయోజనాలేమిటి? అనే టపాకు నా  రెండవవ్యాఖ్య ఇలా ఉంది:
 
రవీంధ్రనాధ్‌గారూ,

నా అభిప్రాయాలను తప్పుబట్టనందుకు ధన్యవాదాలు. అందరూ కలసివస్తే కాని సరైనదారిలో అభివృధ్ధి జరగటం కష్టమన్న మీ‌ అభిప్రాయం‌లో తప్పకుండా తార్కికత ఉన్నది.  కాని ఆరంభం అంటూ ఒకటి ఉండాలి కదా.  అది ఉదాత్తంగా కూడా ఉండాలి కదా.  అందుచేత అన్నిరకాల సంకుచిత ధోరణులను మనం నిర్ద్వందంగా తిరస్కరించగల స్థితిని చేరుకుందుకు గాను కృషిచేయాలని నా విజ్ఞప్తి.  ఒకరయ్యేది పదిమందయ్యేది హృదయపూర్వకంగా యీ ధోరణిలో సాగటం మొదలు పెట్టిన తరువాత భగవంతుడి అనుగ్రహంతో మిగిలినవారు కూడా అర్థంచేసుకుని కలసి వస్తారని ఆశించగలం.  అందు చేత మనం యీ‌ కులమతప్రాంతాదుల ప్రాతిపదికన గుంపుకట్టటం అనే అలవాటునుండి ప్రయత్నపూర్వకంగా విరమించుకోవాలి.  నేను ఏదొ కమ్మసంఘం అన్న నిరసనభావంతో చెబుతున్నానని మీరు అనుకోరన్న నమ్మకం నాకుంది.  నేను జన్మతః బ్రాహ్మణుడనైనా నాకు బ్రాహ్మణసంఘాలపేర గుంపుకట్టటం పైన కూడా అంతే ఆక్షేపణ ఉన్నది అని మీరు అర్థం చేసుకోవాలని కోరుతున్నాను. ఆభిజాత్యం అన్నది దానంత అది చెడ్డలక్షణం కాదు.  కాని అదే సర్వస్వం అన్న పోకడను కలిగి ఉండటమూ దాన్ని జాతీయదృక్పధం కన్న పైన ఉంచాలని ప్రయత్నించటమూ అనేవి జాతి ఉనికికీ దాని అభివృధ్ధికీ చాలా చెఱుపు చేసే విషయాలు.  మాట వరసకు నేటి తెలుగుగడ్డ పరిస్థితినే తీసుకుందాం.  సీమాంధ్రపరిస్థితి అంధకారంగా ఉందని చెప్పవచ్చును.  ఇప్పుడు చీకట్లోంచి యావత్తు సీమాంధ్రనూ ఉధ్ధరించే ఆలోచనలు చేయాలా, మనలో మనం ఏలా మూటలు కట్టుకోవాలా యీ మసకమసక చీకటిలో అని ఏ ముఠాకు ఆ ముఠా అలోచనలు చేయాలా?  దేనిని మనం సమర్థించాలి అన్నది మీరే అలోచించి చూడండి దయచేసి.  ఇక్కడ  నేను ఒక ముఠా అని అన్నది ఒక రాజకీయ పార్టీ కావచ్చును, కులం కావచ్చును, వ్యాపారవర్గం కావచ్చును, సమాజానికి ఒక ఆపద వచ్చినప్పుడు ఎలా స్పందించటం ఉచితం అన్నది విద్యాసంస్కారవాసనలు గల అందరికీ ఎంతో కొంత అవగాహనలో ఉండాలి.  చూదండి అప్పుడే మా నగరంలో రాజధాని పెట్టాలి అంటే మా నగరంలో పెట్టితీరాలీ అని సిగపట్లు మొదలు పెట్టారు.  ఇది సీమాంధ్రను అభివృధ్ధిపథంలో నడిపే లక్షణమేనా?  వీళ్ళా మనకు నాయకులు?  మనని ఈ ఆపత్సమయంలో  ఉధ్ధరించే వారు?  నిర్మొగమాటంగా చెప్పాలంటే, స్వప్రయోజనం తప్ప జాతిప్రయోజనం పట్టని వ్యక్తులూ సంఘాలూ, పార్టీలూ సిధ్ధాంతాలు కాలగమనంలో పాపాన్నీ అపఖ్యాతినీ తప్ప మరేమీ మూటకట్టుకోవటం జరుగదు.  ఒక వరదలో జనం చిక్కుకున్న చోట రక్షణచర్యలకు దిగేవారు మా వాళ్ళను ముందు రక్షించి వీలుంటే మిగతా వారి సంగతి చూడాలని ఆలోచించటం సబబంటారా?  వీలైనంతమందిని ప్రాణాలకు తెగించి రక్షించాలని ముందుకు దూకటం సబబంటారా?  ఇప్పుడు సీమాంధ్రలో ఉన్న అందరి కర్తవ్యమూ ములిగిపోతున్న ఆ ఓడను సురక్షితంగా ఒడ్డుకు చేర్చటం.  ఏమి చేస్తే తమకూ తమవారికీ ఏమి లాభం అని ఆలోచించే వారు ఆ ఓడతో పాటే ములుగుతారు - మిగతావారినీ ముంచుతారు.  సమర్ఘులు కర్తవ్యాన్ని నిష్పాక్షికంగా నిర్వహించకపోతే "దక్షు లెవ్వార లుపేక్ష సేసి రది వారల చేటగు" అని కృష్ణపరమాత్మ చెప్పనే చెప్పాడు.  అధికప్రసంగం చేసానేమో.  ఏదో చాదస్తుణ్ణి. మన్నించగలరు. 


ప్రస్తుత కాలమానపరిస్థితుల గురించి నా అభిప్రాయం ఇక్కడ నిక్షిప్తం చేయటం ద్వారా హెచ్చుమందికి ప్రయోజనం అన్న దృక్పథంతో పై నా వ్యాఖ్యలను ఇలా ఒక టపాగా ఉంచాను.


3 కామెంట్‌లు:

 1. మీటపా ఆలోచింపచేసేలా ఉంది, నిజమాడితే నిష్ఠురం కదా

  రిప్లయితొలగించండి
 2. కులాల పేరుతొ గుంపు కట్టడం మంచిది కాదన్న మీ అభిమతంతో చాలా మటుకు ఏకీభవిస్తున్నాను. ముఖ్యంగా ఇతరులతో పోలికలో కొద్దోగొప్పో ముందంజలో ఉన్న వర్గాలు ఇలా చేయడం వల్ల ఇతరులు ఆందోళన చెందే ప్రమాదం ఎంతోకొంత ఉంటుంది.

  బ్లాగు యజమాని శ్రీనివాస చక్రవర్తి గారిలో తన కులం వారు బాగు పడాలన్న తపన తప్ప ఇతరులు నష్టపోవాలన్న దురుద్దేశ్యం నాకయితే కనిపించలేదు. అలాగే ఆయన ఎవరిపైనా పరుష పదజాలం వాడకుండా జాగ్రత్త పడ్డారు. ఈ రెండు మెచ్చుకోదగ్గ విషయాలు.

  నేను ఈ వ్యాఖ్యలు కేవలం ఈ ఒక్క టపా ఆధారంగా చేయడం లేదు. కొన్ని ఇతర టపాలు చదివాక నాకొచ్చిన అవగాహన ఇదే.

  ఆయన ఇదే నిజాయితీ & స్పూర్తితో "నా కులం" బదులు "నా ప్రాంతం" లేదా "నా దేశం" కోసం పాటు పడితే బాగుంటుంది. మీలాంటి పెద్దలు ఆయనకు & అలాంటి వారికి ఆరకంగా దిశానిర్దేషణ చేయగలిగితే అందరికీ మేలు జరుగుతుంది.

  In short, the blogger looks to be committed, sincere and balanced in his approach. If he can shift his priorities away from caste, it will be beneficial to a wider group.

  రిప్లయితొలగించండి

ఆమోదించిన వ్యాఖ్యలే ప్రచురితం అవుతాయి. తరచుగా పరిశీలించటం వీలు కాదు కాబట్టి అప్పుడప్పుడు వ్యాఖ్యలు కనిపించటం ఆలస్యం కావచ్చును. తరచుగా జవాబులు ఇవ్వటం నాకు వీలు కాదు. ఎక్కువగా చర్చించటం అస్సలు వీలుకాదు.