3, ఫిబ్రవరి 2014, సోమవారం

తెలుగుతల్లీ నీకు వందనం



తెలుగుతల్లీ నీకు వందనం ఘనకీర్తి
కలిగి వెలిగే తల్లి కరుణించవే తల్లి
తెలుగుతల్లీ నీకు వందనం

కన్న బిడ్డలు నేడు కాట్లాడుకొంటుంటె
కన్నీళ్ళు పెడుతున్న కళవళ పడుతున్న
తెలుగుతల్లీ‌ నీకు వందనం

కలుముల గడ్డను కొలిమిగా మార్చిన
కలుషబుధ్ధుల జూచి కళవళ పడుతున్న
తెలుగుతల్లీ నీకు వందనం

నిరసించి కొందరు నీకన్న బిడ్డలే
కొరగాని మాటలుకూడ పలికేరమ్మ
తెలుగుతల్లీ నీకు వందనం

పరభాషలను మెచ్చి పరరాజులను మెచ్చి
కరకులాడే వారి గాంచి శోకించేవు
తెలుగుతల్లీ నీకు వందనం

నీది తప్పన్నచో‌ నీది తప్పని శుష్క
వాదాల నీ‌ పేరు పాడుచేసితి మమ్మ
తెలుగుతల్లీ నీకు వందనం

మా లోపములుచూచి లోలోన కుమిలేవు
కాలప్రభావమ్ము కలిగించె దుర్దశ
తెలుగుతల్లీ నీకు వందనం

కూడిరాని బిడ్డ లీడ పోగైరమ్మ
ఓడలు బండ్లాయె నేడు మాతల్లి
తెలుగుతల్లీ నీకు వందనం

ఈ తీరుగా నిన్ను ఇరుకున పెట్టేము
మా తప్పులను నీవు మన్నించ వమ్మ
తెలుగు తల్లీ నీకువందనం
   
కొంచెమై యుండగా కొన్నాళ్ళు గడచి
మంచిరోజులు మనకు మరల రావచ్చు
తెలుగుతల్లీ నీకు వందనం

అన్నదమ్ముల మధ్య అగ్గిరాజేసిన
చిన్నబుధ్ధుల ప్రభ చెరిగిపోవచ్చు
తెలుగుతల్లీ నీకు వందనం

ఇటువంక నీ బిడ్డ లెటువంటి వారొ
అటువంక నీ‌ బిడ్డ లటువంటి వారె
తెలుగుతల్లీ నీకు వందనం

పాలపొంగు నేడు పగులగొట్టే నేల
కాలాంతరంబున కలిసిపోయేనమ్మ
తెలుగుతల్లీ నీకు వందనం



11 కామెంట్‌లు:

  1. తెనుగు తల్లికి వందనం.

    రిప్లయితొలగించండి
  2. For the sake of argument assuming there is somebody (something) called Telugu talli.

    1. రాష్ట్రంలో ఉన్న 18% తెలుగేతరులకు తల్లి ఎవరు?
    2. ఇతర రాష్ట్రాలలో ఉన్న 12% తెలుగు వారికి కూడా ఈవిడే తల్లా?

    రాష్ట్రం, భాష అనేవి సమాన పదాలు కావు. దేని దారి దానిదే.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. Jai,
      you question the notion of Telugu talli. Very well. You would, in the same way, question the notio of Bharata mata. Right?
      I know equating language and state is a bit blurred. But AP is a linguistic state fo.

      తొలగించండి
    2. Sir,

      I assume the term "mother" (or "father" in like usage) refers to allegiance (or loyalty).

      A state (or any administrative unit for that matter) by its very nature is based on geography. At a minimum, a state enjoys a legal monopoly on the use of force. Equating a geographic unit with a cultural parameter (religion, language, caste etc.) effectively disenfranchises the minority.

      The term Bharat mata does not suffer from the above defect as it embraces every citizen. More importantly, the country is a representation of sovereignty (unlike derived administrative units like states). The concept of Bharat mata (as applied to present day borders) is therefore not contradictory.

      True AP is a so called linguistic state. What does it actually mean? Indian polity does not recognize the concept of a state (or national) language. What we do have are "official languages". The linguistic states concept is little more than the requirement that a particular language be accepted as the official language throughout the state.

      Telugu would continue to be the official language of the region bounded by present day AP irrespective of how many states are formed from this area. All of these would continue to be linguistic states.

      It is worth noting all proponents of the linguistic states theory rejected the "one language, one state" approach. The only serious attempt to push this is Stalin's "theory of nationalities" that formed the basis of "Vishalandhralo prajaswamyam". Their definition of "prajaswamyam" does not of course match what we accept today.

      An interesting tidbit: Telugu is the only case in the world where a language is dubbed a mother. The sobriquet is otherwise reserved for countries, states, rivers etc.

      తొలగించండి
  3. ఇది ద్విపదనా, గేయమా, పాటా...పాదపాదానికి నియత మాత్రలు లేకుండా ఉన్నాయి. వ్యావహారికపదాలు కొల్లలుగా వాడారు. కొన్నిచోట్ల ఇంద్రగణానికి బదులు జగణం వాడారు. పాదోత్తర భాగంలో కొన్నిచోట్ల రెండు ఇంద్రగణాలు, కొన్ని చోట్ల ఒక ఇంద్రగణం, ఒక సూర్యగణం వాడారు. మీ ప్రక్రియ నడకలు పరిశీలించండి. కొన్ని మార్పులవసరమనుకుంటాను. పాటైతే అవసరం లేదు. గేయమైతే, పద్యమైతే అవసరం. వ్యావహారికాల్ని గ్రాంథికాలుగా మార్చాలి. పాటైతే కొంత అది (గ్రాం.), కొంత ఇది (వ్యా.) అవసరం లేదనుకుంటా.

    ఆంధ్రులూ, తెలంగాణులూ వేర్వేరు తల్లుల పిల్లలు. ఆంధ్రమాత ఆంధ్రులకు తల్లి, తెలంగాణ తల్లి తెలంగాణులకు తల్లి. ఇద్దరూ ఒక్కతల్లి పిల్లలుకారు. (ఐతే మమ్మల్ని హీనంగా చూసేవారు కారు).

    ఇన్నాళ్ళూ మీ తెలుగు తల్లి ఆనందంగా ఉంది. ఈ కొద్ది రోజులుగా మా తెలంగాణ తల్లి ఆనందంగా ఉంటోంది.

    ఇద్దరు తల్లులూ సంతోషంగా ఉండే రోజులు దగ్గరలోనే ఉన్నాయి. స్వస్తి.

    రిప్లయితొలగించండి
  4. లాక్షణిక విషయం. ఇది వ్యావహారికరచనే.

    "ఆంధ్రమాత ఆంధ్రులకు తల్లి, తెలంగాణ తల్లి తెలంగాణులకు తల్లి. " ఇది కొత్త భావన. ఒకప్పుడు తెలంగాణావారు తామే ఆంధ్రులం అన్న భావనతో ఉండటమూ జరిగింది. ఇప్పుడు కొత్తగా తెలంగాణాతల్లిని సృష్టించుకుని కొత్తగా మాట్లాడుతున్నారు. మంచిది. రేపు తెలంగాణా తల్లికీ, వరంగల్లు తల్లికీ కూడా ఇలాంటి విబేధమే తలయెత్తవచ్చును.

    తెలంగాణావారిని సీమాంధ్రులు హీనంగా చూసారన్నది పసలేని వాదన. నిజానికి తెలంగాణావాదులే సీమాంధ్రులపట్ల అవాచ్యాలతో నిందలకు దిగటం నేటి ఫ్యాషన్. మీరే 'నోరు మూయుడీ' వంటి చెత్త ప్రయోగాలూ చేసారు. గమనించుకోండి.

    తెలుగు గడ్డని కుట్రలతో ముక్కలుచెక్కలు చేసి తెలుగుతల్లి ఆనందంగా ఉంటుందని అనుకోలేము కదా. ఐతె గియితే, ఒక తలనొప్పి వదిలిందన్న భావనతో కొంతలో కొంత సంతోషంగా ఉండవచ్చునేమో. కాని అది వారి నిరాశను కప్పిపుచ్చేంతది కాదు. అంతా కాలం మహిమ. ముందుముందు ఏం జరిగేదీ ఇప్పుడు చెప్పలేం.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. ఇంతకముందు పేర్కొన్నట్టు ఒక భౌగోళిక అస్తిత్వానికి భాషను ఆపాదించడంలో అపస్వరం గోచరిస్తుంది. తెలంగాణా, ఆంద్ర (లేదా సీమాంధ్ర) రెంటిని ప్రాంతాలుగా భావిస్తే ఇబ్బంది ఉండదు. ఎల్లలు లేని భాషకు ఒక రాష్ట్రం కావాలని అనుకోవడం అసమంజసం.

      తెలంగాణా తల్లికి, ఆంధ్రమాతకు విబేధాలు రావడం తప్పేమీ కాదు. భవిష్యత్తులో వరంగల్లుకు తెలంగాణకు (లేదా విశాఖకు ఆంధ్రకు) విబేధాలు ఒకవేళ వస్తే వాటిని పరిష్కరించుకోవాలే తప్ప తల్లి ముక్కచెక్కలయిందని వాపోవడం వల్ల ప్రయోజనం ఉండదు.

      తొలగించండి
    2. > భవిష్యత్తులో వరంగల్లుకు తెలంగాణకు విబేధాలు ఒకవేళ వస్తే వాటిని పరిష్కరించుకోవాలే..

      ఇప్పుడు జరుగుతున్నట్లుగానే, అప్పుడూ విడిపోవటమే పరిష్కారమనీ, నిందలు వేయటమే విడిపోవటానికి దారి అనీ భావించే అవకాశమూ‌ ఉండదా? మీరు చెప్పే పరిష్కరించుకోవటం అనే మార్గం ఇప్పుడు మీకు ఆమోదయోగ్యం కాకపోయినట్లుగానే అప్పుడు కూడా వారిలో ఒకరికి అమోదయోగ్యం కాకపోవచ్చును కదా? 'నీవు నేర్పిన విద్యయే‌నీరజాక్ష' అనే రోజు తప్పక రావచ్చును!

      మంచిది. ఈ విషయం ఇంకా చర్చించటం దండగ. చర్చ ముగిద్దాం.

      తొలగించండి
  5. రిప్లయిలు
    1. అలా అంనుకొంటే మీకు ఆనందంగా ఉంటుందా?
      సరే, అలాగే కానివ్వండి.

      తొలగించండి
    2. Sir, I considered both options without selectively highlighting what allegedly gives me ఆనందం

      తొలగించండి

ఆమోదించిన వ్యాఖ్యలే ప్రచురితం అవుతాయి. తరచుగా పరిశీలించటం వీలు కాదు కాబట్టి అప్పుడప్పుడు వ్యాఖ్యలు కనిపించటం ఆలస్యం కావచ్చును. తరచుగా జవాబులు ఇవ్వటం నాకు వీలు కాదు. ఎక్కువగా చర్చించటం అస్సలు వీలుకాదు.