ఈ రోజున తెలుగులోకం చీకట్లో ముంచబడింది. కొంతమంది చీకటినే వెలుగు అనుకుంటున్నారు. అంతా కాలవైపరీత్యం. |
18, ఫిబ్రవరి 2014, మంగళవారం
చీకటిలో కారు చీకటిలో ..........
7 కామెంట్‌లు:
కం. పలుకుడు పలికెడు నెడలను
పలుకుల విలువలకు మురిసి పలికెడు కళలో
నిల గడుగడు నిపుణులు తగ
పలికెడు తెఱగిటుల ననుచు పలుకగ విబుధుల్
(తెలుగులో వ్రాయటానికి అవసరమైతే లేఖిని సహాయం తీసుకోండి. Windows వాడేవారు ప్రముఖ్ IME డౌన్ లోడ్ చేసుకోవచ్చును )
గమనిక: అమోదించబడిన వ్యాఖ్యలు మాత్రమే ప్రచురించబడతాయి. తమ పరిచయం పొందుపరచకపోతే అజ్ఞాతల వ్యాఖ్యలు వెంటనే బుట్టదాఖలు అవుతాయి.
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
Status quo ante of 1953 i.e. the state Potti Sreeramulu fought & died for
రిప్లయితొలగించండిచాలా బాగుందండీ. తిరోగమించి ఒకప్పటి స్థితికి జారుకోవటమే అభివృధ్ధి అంటారు. మరింత తిరోగమించి ఘనతవహించిన బ్రిటిషువారి కాలానికీ పోతామేమో క్రమంగా ఇలాంటి అభివృధ్ధిప్రణాళికలతో. బ్రిటిషువారు మొగమాట పడతారేమో లెండి. పోనీ ఇటలీవారి పాలన కూడా బాగానే ఉంది కదా మనదేశంలో తగినంతమందికి. కాకపోతే నాలుగొందలమంది చీకట్లో జై అనటం చిన్నవిషయమా చితకవిషయమా చెప్పండి. ఫార్మాలిటీస్ పూర్తి చేసుకొని ఇటలీ వారిని మనకు ఏలికలుగా పార్లమెంటులో మరొక చీకటితీర్మానం ఆమోదించేస్తే సరిపోతుంది. హాయిగా మరికొన్ని శతాబ్దులు వారి కాల్మొక్కుతూ తరించిపోవచ్చును.
తొలగించండిThere was no darkness. What center did is better than 2 minutes drama played by Andhra CM & Speaker on Telangana.
తొలగించండిSid Potti Sriramulu fight for AP? Can you honestly answer this?
గొట్టిముక్కలవారూ,
తొలగించండిచీకటి అన్నది ఇక్కడ ఒక సాంకేతికపదం. అందరి కళ్ళనూ చెవులనూ మూసి అత్యంతగోప్యంగా అస్మదీయుల భళాభళిలమధ్య తంతునడిపించటం గురించిన ఆక్షేపణలో భాగమే చీకటి అనే ప్రతీకను ప్రయోగించటంలో ఆంతర్యం. ఇదంతా మీకు అవగతం కాకపోతే నేనేమీ చేయలేను, కాని మీకు చక్కగానే అవగతం అయి ఉంటుందని నా భావన. కొద్దిరోజుల క్రిందట ముఖ్యమంత్రి నడిపిన డ్రామాను నేను సమర్థించలేదే? అసలు కాంగీవారు అసెంబ్లీ అన్నదానికీ దానిమాటకూ ఏమీ విలువ ఇవ్వనప్పుడు దానిలో జరిగినతంతు గురించి చర్చ అనవసరం. పార్లమెంటువారు ఆంధ్రప్రదేశ అసెంబ్లీ స్ఫూర్తిగా వ్యవహరించారని మీరు భావిస్తున్నారా? మంచిది. ఆలాగైతే వారూ ఈ బిల్లుని ఏకపక్షంగా తిరస్కరించవలసిందేనేమో మరి. ఎందుకొచ్చిన అనవసరచర్చ ఇది?
పొట్టిశ్రీరాములమీద మీ దండయాత్ర దేనికిప్పుడూ? అదీకాక మీ ప్రశ్న తీరును చూస్తే మీకు నా honesty గురించి నమ్మకం లేదని తెలుస్తున్నది. అలాంటప్పుడు మీ ప్రశ్నకు జవాబు చెప్పవలసిన అవసరమూ లేదు నాకు. గమనించగలరు.
దూషణలపర్వం కొనసాగించదలచుకొనేవారితోనూ తప్పులు పట్టటంలో ఆనందం వెతుక్కునేవారితోనూ వాదించలేం - అది మీరైనా నేనైనా సరే.
నేను పొట్టి శ్రీరాములు గారిని ఏమీ అనలేదండీ. వారు కోరుకున్న రాష్ట్రం సిద్దించడం వారి ఆత్మకు శాంతి ఇస్తుందని నా నమ్మకం. దాన్ని తిరోగమనం కింద చూడడం అవసరం లేదని అనుకుంటాను.
తొలగించండిమాస్టారూ, శుభాకాంక్షలు. తెలంగాణా వాదులకి.అలాగే ఆంధ్రులకి కూడా. ఎందుకంతే ఇకనైనా మన ప్రాంతం అభివృద్ది అవుతుందనే ఆశ. ఆకాంక్ష.
రిప్లయితొలగించండితెలంగాణావాదుల్ని ఈ రోజున చీకటివెలుగుల రంగేళీ క్రీడలో విజేతలుగా ప్రకటించటమైనది. వారికి శుభాకాంక్షలు చెప్పటం మంచి ఆలోచనే కాని అల్పుల ప్రశంశలు విజేతలకు అవసరమని వారు భావించకపోవచ్చును. సీమాంధ్రులకు శుభాకాంక్షలు చెప్పటం దండగ. వారింకా తమలోతాము తన్నుకు చావటంలోనే ఎప్పటిలాగే నిమగ్నులై ఉన్నారు. మనబోటివారి మాటలు వారికి వినబడి చావవు. ఇకపోతే సీమాంధ్రపెద్దలకైనా చెబుదామనుకుంటే, వారేమో మహారాణీవారు ఆడిస్తున్న నాటకంలోని తరువాతి అంకం తాలూకు డైలాగులు బట్టీపట్టటంలో తీరిక లేకుండా గడబిడగా ఉన్నా రు. వారికి మీ శుభాకాంక్షలు అందుకునే తీరిగా లేదు, అవి అందుకుందుకు రాజానుమతమూ లేదు. మీ రేదో అభివృధ్ధి అంటున్నారు? మనలో మనం అభివృధ్ధి చెందటం అన్న విషయం గురించి ఆలోచించుకునే అలవాటు లేదు మనకు శతాబ్దాలుగా! ఒకరిని అభివృధ్ధిచేసి విజయవంతంగా సాగనంపటమైనది కదా! ఇప్పుడు మరెవరిని అభివృధ్ధి చేయాలా అన్నదే తీరిగ్గా అలోచించుకోవాలి. ఫరవాలేదు లెండి. ఆ విషయమూ రాజాజ్ఞలు యీ సీమాంధ్రులకు త్వరలోనే అందుతాయి.
తొలగించండి