27, ఫిబ్రవరి 2014, గురువారం

శివలింగ స్తుతి (దండకం)




శ్రీకంఠ సర్వేశ సద్భక్తమందార దేవాధిదేవా
నమస్తే సదా శంభులింగాయ తుభ్యం
నమస్తే సదా దివ్యలింగాయ తుభ్యం
నమస్తే సదా స్వర్ణలింగాయ తుభ్యం
నమస్తే సదా తామ్రలింగాయ తుభ్యం
నమస్తే సదా రౌప్యలింగాయ తుభ్యం
నమస్తే సదా కాఠలింగాయ తుభ్యం
నమస్తే సదా వాయులింగాయ తుభ్యం
నమస్తే సదా వహ్నిలింగాయ తుభ్యం
నమస్తే సదాఽకాశలింగాయ తుభ్యం
నమస్తే సదా భౌమలింగాయ తుభ్యం
నమస్తే సదా నీరలింగాయ తుభ్యం
నమస్తే సదా భూరిలింగాయ తుభ్యం
నమస్తే సదా విశ్వలింగాయ తుభ్యం
నమస్తే సదా సూర్యలింగాయ తుభ్యం
నమస్తే సదా చంద్రలింగాయ తుభ్యం
నమస్తే సదా ప్రాణలింగాయ తుభ్యం
నమస్తే సదా బ్రహ్మలింగాయ తుభ్యం
నమస్తే సదా భావలింగాయ తుభ్యం
నమస్తే సదా వైద్యలింగాయ తుభ్యం
నమస్తే సదా వేదలింగాయ తుభ్యం
నమస్తే సదా శాంతలింగాయ తుభ్యం
నమస్తే సదా రామలింగాయ తుభ్యం
నమస్తే సదా భీమలింగాయ తుభ్యం
నమస్తే సదా సోమలింగాయ తుభ్యం
నమస్తే సదా రుద్రలింగాయ తుభ్యం
నమస్తే సదా భద్రలింగాయ తుభ్యం
నమస్తే సదా కాలలింగాయ తుభ్యం
నమస్తే సదా నాదలింగాయ తుభ్యం
నమస్తే సదా నాగలింగాయ తుభ్యం
నమస్తే సదా యోగలింగాయ తుభ్యం
నమస్తే సదా భోగలింగాయ తుభ్యం
నమస్తే సదా జ్ఞానలింగాయ తుభ్యం
నమస్తే సదా శర్వలింగాయ తుభ్యం
నమస్తే సదా సర్వలింగాయ తుభ్యం
నమస్తే సదా ధర్మలింగాయ తుభ్యం
నమస్తే సదా ధ్యానలింగాయ తుభ్యం
నమస్తే సదా లోకలింగాయ తుభ్యం
నమస్తే సదా తత్త్వలింగాయ తుభ్యం
నమస్తే సదా సత్త్వలింగాయ తుభ్యం
నమస్తే సదా సత్యలింగాయ తుభ్యం
నమస్తే సదా నిత్యలింగాయ తుభ్యం
నమస్తే సదా కోటిలింగాయ తుభ్యం
నమస్తే సదా మోక్షలింగాయ తుభ్యం
నమస్తే సదా శ్వేతలింగాయ తుభ్యం
నమస్తే సదా జైత్రలింగాయ తుభ్యం
నమస్తే సదా స్థూలలింగాయ తుభ్యం
నమస్తే సదా సూక్ష్మలింగాయ తుభ్యం
నమస్తే సదాఽవ్యక్తలింగాయ తుభ్యం
నమస్తే సదా బుధ్ధిలింగాయ తుభ్యం
నమస్తే సదా భూతలింగాయ తుభ్యం

నమస్తే సదా భస్మలింగాయ తుభ్యం
నమస్తే సదా యజ్ఞలింగాయ తుభ్యం
నమస్తే సదా సామలింగాయ తుభ్యం
నమస్తే సదాఽథర్వలింగాయ తుభ్యం
నమస్తే సదాఽనందలింగాయ తుభ్యం
నమస్తేస్తు తన్మాత్రలింగాయ తుభ్యం
నమస్తేస్త్వహంకారలింగాయ తుభ్యం
నమస్తేస్తు వాయూర్ధ్వలింగాయ తుభ్యం
నమస్తేస్తు త్రైగుణ్యలింగాయ తుభ్యం
నమస్తేస్తు సర్వాత్మలింగాయ తుభ్యం
నమస్తేస్తు యజ్ఙాంగలింగాయ తుభ్యం
నమస్తేస్తు విజ్ఞానలింగాయ తుభ్యం
నమస్తేస్తు పాతాళలింగాయ తుభ్యం
నమస్తేస్తు ఖవ్యాప్తలింగాయ తుభ్యం
నమస్తే  నిరాకారలింగాయ తుభ్యం
నమస్తే నమస్తే నమస్తే మహాదేవ
శంభో నమస్తే నమస్తే నమస్తే నమః


[మహాశివరాత్రపర్వదిన సందర్భంగా భక్తకోటికి శుభాకాంక్షలతో]

3 కామెంట్‌లు:

  1. శివరాత్రి పర్వదినమున
    శివకర దండకముఁ జెప్పి చిత్తమ్మలరిం
    చు విశిష్టమిత్రుని జన
    స్తవనీయు నమస్కరింతు శ్యామలరావున్.

    రిప్లయితొలగించండి
  2. స్పందించిన సహృదయశివభక్తవరేణ్యులకు ధన్యవాదాలు.

    శ్రీనేమానివారు ‌ఈ‌ దండకం పైన మిక్కిలి ఆసక్తితో స్పందించి నాతో ఫోన్ ద్వారా మరియు ఇ-మెయిల్ ద్వారా అమూల్యమైన సలహాలను అందించారు. వారికి మిక్కిలిగా రుణగ్రస్తుడను. వారు కొవ్వూరులో నుండు శ్రీ కొంపెల్ల వెంకట రామ శాస్త్రి గారికి వినిపించగా వారుకూడా సంతోషించి బాగున్నదని సెలవిచ్చినట్లు తెలిపారు.

    మొదట ప్రకటించిన పాఠం నుండి చూస్తే స్వల్పమైన మార్పులు గోచరిస్తాయి. మొదట్లో ప్రకటించిన పాఠంలో
    నమస్తే సదా శంభు లింగస్వరూపా
    ఇత్యాదిగా ఉన్నది. ఐతే నమస్తే అని చతుర్థీవిభక్తిగా చెప్పినప్పుడు శ్రీనేమానివారు సూచించినట్లు లింగస్వరూపాయ అని వ్రాయాలి. అందుచేత
    నమస్తే సదా శంభు లింగస్వరూపాయ తుభ్యం
    ఇత్యాదిగా మార్చాను మలిపాఠంలో.
    కాని ఇలాచేయటం వలన కొంచెం దైర్ఘ్యం కానరావటం గమనించి పఠనసౌలభ్యం మరియు తూగు కొరకు మరొకసారి సవరించిన పాఠం
    నమస్తే సదా శంభు లింగాయ తుభ్యం
    ఇత్యాదిగా చేయటం‌ జరిగింది.
    అందరూ గమనించవలసిందిగా విజ్ఞప్తి.

    రిప్లయితొలగించండి

ఆమోదించిన వ్యాఖ్యలే ప్రచురితం అవుతాయి. తరచుగా పరిశీలించటం వీలు కాదు కాబట్టి అప్పుడప్పుడు వ్యాఖ్యలు కనిపించటం ఆలస్యం కావచ్చును. తరచుగా జవాబులు ఇవ్వటం నాకు వీలు కాదు. ఎక్కువగా చర్చించటం అస్సలు వీలుకాదు.