25, ఫిబ్రవరి 2014, మంగళవారం

ఏమి చేయ మందు వీశ్వరాఏమి చేయ మందు వీశ్వరా  ఈ వేదన
లే మిష కలిగించి తీశ్వరా

ఇల్లు రెండు చెక్కలాయె
తల్లి మనసు ముక్కలాయె
ఎల్లెడ పెను చీకటాయె
పిల్లల గతి తెలియదాయె
    ఏమి చేయ మందు వీశ్వరా

ఈ జాతి భవిష్యమెల్ల
రాజకీయ నాయకులే
భోజనము చేయుచుండ
ఈ జన మే మౌదురో
    ఏమి చేయ మందు వీశ్వరా  

 మంచి వాడ వైన నీవు
కొంచెము దయ జూపవాయె
వంచకులను నెట్టి వెలుగు
నించవాయె మా బ్రతుకుల
ఏమి చేయ మందు వీశ్వరా