ఉ. బంగరు లేడి యుండదని బాగుగ సీత యెఱుంగ లేదె తా
వెంగలి యేమి రాఘవుడు వెంబడి పోవగ దాని జూచి మీ
దం గలుగంగ నైన కథ దానవనాశన మన్నమాట నా
యింగితహీనదస్యపతి యేమి యెఱుంగమి రామలీలయే
(వ్రాసిన తేదీ: 2013-1-24)
వెంగలి యేమి రాఘవుడు వెంబడి పోవగ దాని జూచి మీ
దం గలుగంగ నైన కథ దానవనాశన మన్నమాట నా
యింగితహీనదస్యపతి యేమి యెఱుంగమి రామలీలయే
(వ్రాసిన తేదీ: 2013-1-24)
నిజం
రిప్లయితొలగించండి
రిప్లయితొలగించండిశ్యామలీయం గారు,
ఇది సీతమ్మ గారి కర్మయా లేక రామన్న గారి లీలయా ? లేక రావణ బ్రహ్మ కర్మ నివృత్తి యా ?
జిలేబి.
జిలేబీ గారు
రిప్లయితొలగించండికాదండి. అది జయ విజయులు చేసుకున్న అదృష్టం. లేకపోతే సీతనెత్తుకుపోయినప్పట్నుంచి చచ్చేదాకా రావణుడు కంటి మీద నిద్రలేకుండా ఎన్నిసార్లు రాముడ్ని తల్చుకున్నాడో కదా? అంతలా తల్చుకున్నాడు కనకే రాముడు వాడికోసం అష్టకష్టాలు పడి అయినా సరే లంక దాకా వెళ్ళేడు వాడికి జన్మరాహిత్యం కల్గించడానికి.
కామోత్కంఠిత గోపికల్, భయముతో కంసుండు, వైరక్రియా.. నృపతుల్
సంబంధులై వృష్ణుల్...
...
... ... హరిన్ చెందన్ వచ్చు ధాత్రీశ్వరా
భగవంతుడు ఎంతటి వాడంటే భక్తుడికోసం ఆఖరికి ముష్టి ఎత్తడానికైనా సిద్ధం అని వామనుడు నిరూపించేడు కదా?
కం. హరి హరి సిరి యురమున గల హరి
హరి హయునిగొరకు దనుజునడగం జెనియన్
పరహిత... దొరలకు
అడుగుటయు...
(అయ్యో, అయ్యో, సాక్షాత్తూ లక్ష్మీ దేవి హృదయంలో గల హరి అడుక్కోడానికి వెళ్ళాడోయ్!)
శ్యామలీయం గారు పోతన పద్యాలు పూర్తిగా చెప్పగలరు. నేను మర్చిపోయేను (యధావిధిగా)
జిలేబీగారూ, DGగారు ఉటంకించిన పద్యాలు:
తొలగించండికామోత్కంఠత గోపికల్ భయమునం గంసుండు వైరక్రియా
సామాగ్రిన్ శిశుపాలముఖ్య నృపతుల్ సంబంధులై వృష్ణులుం
బ్రేమన్ మీరలు, భక్తి నేము నిదె చక్రింగంటి మెట్లైన ను
ద్ధామధ్యానగరిష్ఠుఁడైన హరిఁ జెందన్ వచ్చు ధాత్రీశ్వరా!
హరి హరి! సిరి యురమున గల
హరి హరిహయు గొఱకు దనుజు నడుగగ జనియెన్
పరహితరతమతి యుతులగు
దొరలకు నడుగుటలు నొడలి తొడవులు పుడమిన్
శ్యామలీయం వారు,
రిప్లయితొలగించండిచూశారా! ఎంత మంచి చర్చ జరుగుతోందో!! నిరాశ పడకూడదు, మీకు చెప్పేటంతవాడిని కాదు కాని :)
శ్యామలీయం గారు
రిప్లయితొలగించండిధన్యవాదములు పద్యాలు రాసినందుకు. అంబరీష చరిత్రంలో పద్యం కూడా ఇలాగే చెప్తోంది. భక్తుడి చూపు నామీద పడాలే గానీ నేను వాణ్ణి వదుల్తానా అంటున్నాడు చూడండి.
చలమున బుద్ధిమంతులగు సాధులు నా హృదయంబులీల దొంగిలికొనిపోవుచుందుర
కిల్భిష భక్తిలతాచయంబులన్, నిలువుగబట్టి కట్టుదురు నేరుపుతో మదకుంభికైవడిన్
వలలకు జిక్కి భక్త జన వత్సలతన్ జనుచుందు తాపసా... (దయచేసి పూర్తి చేయగలరు)
వాళ్లు నన్ను భక్తితో కట్టేస్తున్నారు కనక నేను వాళ్ళని విడవను అని చెప్తున్నాడు కానీ, అందులో నా గొప్పదనం ఏమీ లేదు (ట).
రామకృష్ణ పరమహంస కూడా ఒక సందర్భంలో, వివేకానందుడితో 'నాయనా నీ కోసం నేను గడప గడప కి తిరిగి అయినా ముష్టి ఎత్తగలను ' అన్నారుట. ఇంకో స్వామి గారు వివేకానందుడి నడుం నెప్పికి మర్దనా చేస్తూంటే వేరే ఆయన అడిగేరుట 'ఏమిటండీ, ఈ వివేకానందులు? ఇష్టం వచ్చినట్టూ మీచేత పనులు చేయించుకుంటున్నారూ అంటే' ఆ స్వామిగారు విస్తుపోయి "ఏమిటి నువ్వనేది? ఆయన సాక్షాత్తూ పరమేశ్వరావతారం. ఆయన నన్ను నడుము పట్టమని అడగడమే ఒక దీవెన నాకు." అన్నారుట.
సంతోషంగా D.Gగారూ, మీ రడిగిన పద్యం ఇదిగో:
తొలగించండిచలమున బుద్ధిమంతులగు సాధులు నా హృదయంబు లీల దొం
గిలి కొనిపోవుచుండుదు రకిల్బిషభక్తిలతాచయంబులన్
నిలువఁగఁ బట్టి కట్టుదురు నేరుపుతో మదకుంభికైవడిన్
వలలకుఁ జిక్కి భక్తజన వత్సలతం జనకుందుఁ దాపసా