15, మార్చి 2013, శుక్రవారం

ఆశలు లేని దెవ్వరికి

ఉ. ఆశలు లేని దెవ్వరికి న్నివిధంబుల తృప్తి మీరగా
నాశలు తీరె నెవ్వరికి నాశల వెంబడి పర్వులెత్తి పే
రాశలు వెక్కిరించ తుద కాయువు తీరెడు వేళ నిన్ను నా
త్మేశు భజించ నైతి నని యేడ్తురు రామ సమస్త మానవుల్


(వ్రాసిన తేదీ: 2013-1-22)

2 కామెంట్‌లు:

 1. చాలా బాగుందండి, ఈ పద్యం. కంచెర్ల గోపన్న పద్యాన్ని గుర్తు తెస్తోంది.. సరిగ్గా గుర్తులేదు కానీ ఇలా ఉంటుంది.

  "బాంధవుల్ గప్పినవేళ, నాటికి నీ స్మరణ కల్గుదో.. దాశరధీ కరణాపయోనిధీ.."

  రిప్లయితొలగించు
  రిప్లయిలు
  1. మీరు గుర్తుచేసుకుంటున్న పద్యం:
   ముప్పున గాలకింకరులు ముంగిట వచ్చిన వేళ, రోగముల్
   గొప్పర మైనచో గఫము కుత్తుక నిండిన వేళ, బాంధవుల్
   గప్పిన వేళ, మీ స్మరణ గల్గునొ గల్గదొ నాటి కిప్పుడే
   తప్పక చేతు మీ భజన దాశరథీ కరుణాపయోనిధీ.

   మహానుభావులు రామదాసుగారితో నాకు పోలిక యేమిటి లెండి గాని రెండు పద్యాల భావఛ్ఛాయలకు బేధం ఉన్నది.

   తొలగించు

కం. పలుకుడు పలికెడు నెడలను
పలుకుల విలువలకు మురిసి పలికెడు కళలో
నిల గడుగడు నిపుణులు తగ
పలికెడు తెఱగిటుల ననుచు పలుకగ విబుధుల్

(తెలుగులో వ్రాయటానికి అవసరమైతే లేఖిని సహాయం తీసుకోండి. Windows వాడేవారు ప్రముఖ్ IME డౌన్ లోడ్ చేసుకోవచ్చును )

గమనిక: అమోదించబడిన వ్యాఖ్యలు మాత్రమే ప్రచురించబడతాయి.